– రేవంత్ రెడ్డి బుద్ది కూడా వంకరనే
– అమలు చేయ చేత కాకనే బీఆర్‌ఎస్ పార్టీ మీద ఏడుస్తున్నావు
– మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ: ఆలేరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే కంపు నోరుతో అవే గబ్బు మాటలు మాట్లాడాడు అని మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు.కుక్క తోక వంకర అన్నట్టు..రేవంత్ రెడ్డి బుద్ది కూడా వంకరనే. అందుకే కనకపు సింహాసనం మీద శునకం కూర్చుండ బెడితే ఎలా ఉంటుందో…రేవంత్ రెడ్డి తీరు అలానే ఉంది.
సి.ఎం కుర్చీ ఎక్కినంక కూడా తనకు అలవాటు అయిన బజారుభాష పోవడం లేదు. అదే కంపు నోరు..అవే గబ్బు మాటలు. కొత్తగా చేసిన పనులు చెప్పడానికి ఏమి లేకనే అదికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఇంకా కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నాడు కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాను అనలేదు.మరో తేదీ అడిగారు.
70 ఏండ్ల వయసులో ఉన్న కేసీఆర్ అనుకోకుండా కాలు జారి పడితే ఏవో పాపాలు చేస్తే దేవుడు శిక్షించినట్టుగా మాట్లాడటం నీ కుసంస్కారాన్ని సూచిస్తుంది. యాదాద్రి సాక్షిగా ఆలేరు సభలో పాపాలు, శిక్ష అంటూ పెద్ద మాటలు మాట్లాడినావు. మరి ఎన్నికలప్పుడు అదే యాదాద్రి దేవుని మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని మాట తప్పిన నీకు ఆ దేవుడు ఏ శిక్ష వేయాలి ?
ఒకసారి అప్పు పుట్టడం లేదు అంటాడు..ఢిల్లీలో చెప్పులెత్తుకెళ్లే దొంగను చూసినట్టు చూస్తున్నారు అంటాడు, మళ్ళీ అదే నోటితో 1,60,000 కోట్ల అప్పు తెచ్చాను అంటాడు.ఏది నిజం ? రాష్ట్రం దివాళా తీసింది, నన్ను కోసిన ఒక్క రూపాయి లేదు అంటాడు. మరి ఇవాళ ఆలేరులో 1300 కోట్లతో అభివృద్ధి పనులు ఎలా శంకుస్థాపన చేశారు ? అట్గాగే నిన్న క్యాబినెట్ మీటింగ్ లో 19,579 కోట్లతో మెట్రో రైల్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఎలా చెప్పారు ?
33,000 కోట్లతో హ్యామ్ మాడల్ లో R&B మరియు పంచాయతి రోడ్లు అభివృద్ధి చేస్తాం అని ఎలా నిర్ణయాలు ఎలా తీసుకున్నారు. ఈ డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి ? రోజుకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ది నోరు అనాల మోరి అనాల ? ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా ? నేను రాగానే 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చావు.
అధికారంలోకి వచ్చి 600 రోజులైనా ఏ ఒక్క హామీ అయిన సక్రమంగా పూర్తి స్థాయిలో అమలు చేశావా ? రుణమాఫీ , రైతు భరోసా అమలు ఎందుకు మధ్యలో ఆగిపోయినాయి..? అకాల మరణం చెందిన రైతుల కోసం కట్టవలసిన రైతు భీమా ప్రీమియం ఎందుకు కట్టడం లేదు ?
తులం బంగారం ఎక్కడ? మహిళలకు 2500 ఏమైంది? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశావా ? విద్యార్థినులకు స్కూటీ లు ఏవి,విధ్యాభరోసా కార్డు కు భరోసా లేకుండా చేసావు. ఇందిరమ్మ ఇండ్లు , యువ వికాసం పార్టీ కార్యకర్తల పాలైంది,కౌలు రైతులకు రైతు భరోసా ఏటు పోయింది, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఏమైంది ? ఏది సక్రమంగా అమలు చేసావు..ఇచ్చిన హామీలు అమలు చేయ చేత కాకనే ఇంకా బీఆర్‌ఎస్ పార్టీ మీద ఏడుస్తున్నావు
నువ్వు అధికారంలోకి వచ్చాక పేద ప్రజలపై చేస్తున్న అహంకారపూరిత పాలన పాపాలకు దేవుడు అవసరం లేదు ఈ ప్రజలే శిక్ష విధిస్తారు. ఎప్పుడైనా తెలంగాణ కు శ్రీరామ రక్ష కేసీఆరే. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జోడెడ్ల లాగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణ ను దేశంలోనే అగ్రగమిగా నిలిపిన ఘనత కేసీఆర్ ది.
మంచిగా ఉన్న తెలంగాణ ను అధికారంలోకి వచ్చిన సంవత్సన్నర లోనే నీ పాలనతో నాశనం చేసావు.. అధికార మదంతో కన్నుమిన్ను కానక విర్రవీగుతున్నావు. కేసీఆర్ కి అధికారమిస్తే తెలంగాణ బాగు కోరిండు.. ప్రజలు నీకు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలను గాలికి వదిలి నీ బాగు నీ కుటుంబ బాగు కోరుతున్నావ్ . దోచుకోవడానికి ఏ వ్యవస్థను రేవంత్ రెడ్డి వదిలిపెట్టడం లేదు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలుతుంది. నీ పాలన తప్పిదాలు కప్పి పుచ్చుకోవడానికి ,నీమీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావ్.
ఇప్పటికైనా గల్లి లీడర్ లా కాకుండా సి.ఎం లా వ్యవహరించు. ప్రజల కిచ్చిన హామీల అమలు పై దృష్టి పెట్టు. లేకుంటే రాబోయే కాలంలో శిశుపాలుడిలా నీవు చేసే పాపాలకు పాపం పండి ప్రజలు శిక్ష వేసే రోజు త్వరలోనే వస్తుంది,.