కర్రసాముతో కిక్కెక్కించిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది. రాజకీయాల్లో పదునైన విమర్శలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. రాష్రంలో కాంగ్రెస్ కు పునర్వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆయన క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు. ఇంత బిజీలో కూడా కాస్త విరామం తీసుకుని అభిమానులను ఉర్రూతలూగించారు.

రేవంత్ రెడ్డి అన్న కొడుకు వివాహం కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో చాలా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో రేవంత్ కర్రసాము చేశారు. పక్కన తీన్మార్ కొడుతుండగా.. రేవంత్ చేసిన కర్రసాము అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక ప్రొఫెషనల్ మాదిరి ఆయన కర్ర తిప్పుతుంటే అందరూ కాన్నార్పకుండా చూశారు. ఆ ప్రదేశం విజిల్స్ తో దద్దరిల్లింది. ప్రస్తుతం రేవంత్ కర్రసాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply