– రంగరాజన్‌కు రేవంత్ రెడ్డి ఫోన్
హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
రంగరాజన్ నమస్తే సర్, నమస్తే అనగానే… ముఖ్యమంత్రి “నమస్తే అయ్యగారూ” అని పలకరించారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు చెప్పాల్సింది కదా అని ముఖ్యమంత్రి అడిగారు. అందుకు రంగరాజన్ స్పందిస్తూ.. మీరున్నారు కదా? పోలీసులు కూడా బాగా పనిచేస్తూనే ఉన్నారు అని బదులిచ్చారు. ” మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు .దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి.. ఎమ్మెల్యేకు కూడా సూచన చేశా. ఒకసారి వీలు చూసుకొని చిలుకూరు బాలాజీ ఆలయానికి వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సహకారం అవసరమైతే తమకు చెప్పాల ” ని ఆయన అన్నారు.