Suryaa.co.in

Andhra Pradesh

24న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

– 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్
– 28న బడ్జెట్

అమరావతి : కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. గత జులైలో చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఈనెల 24న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ లతో చీఫ్ విప్ సమావేశం కానున్నారు. సమావేశాల నిర్వహణపై వీరు ప్రధానంగా చర్చించనున్నారు. 24న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత, బీఏసీ సమావేశం నిర్వహించి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

LEAVE A RESPONSE