– ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్న
– అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ… మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో, దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?
అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి? 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం.
కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.