Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఇరు రాష్ట్ర ఉద్యోగ ఎన్జీవోలు సంప్రదింపులు

హైదరాబాద్: టీఎన్జీవో భవనంలో జరిగిన అంతరాష్ట్ర ఉద్యోగ బదిలీల సమావేశంలో టీఎన్జీవో, ఏపీఎన్జీవో నాయకులు పాల్గొనడం జరిగింది. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆప్షన్ లేని జిల్లా, జోనల్ ,మల్టీ జోనల్ క్యాడర్లకు చెందినటువంటి స్థానికేతర ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు . వీరంతా ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ కోల్పోవడం ,వారి పిల్లల స్థానికత కోల్పోవడం, ప్రభుత్వం వారు జారీ చేసిన హెల్త్ కార్డులు తల్లిదండ్రులకు పని చేయకపోవడం, ఫీజు రియంబర్స్మెంట్ ఆయా రాష్ట్రాలలోవర్తించకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇరు రాష్ట్ర ఉద్యోగులు టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ , ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ రమణ సాయిరాం వద్ద ఇరు రాష్ట్ర బదిలీ ఉద్యోగ యూనియన్(nlta, tnewsa) ప్రతినిధులు తమ బాధలు తెలియజేస్తూ వారు ముందు వాపోయారు. త్వరలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిసి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని tngo, apngo ఉద్యోగ ప్రతినిధులు తెలియజేశారు.

LEAVE A RESPONSE