– జై తెలంగాణ అని ఏనాడైనా ఉద్యమించినవా?
– తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసింది రేవంత్ రెడ్డి
– రేవంత్ లక్కీ లాటరీతో ముఖ్యమంత్రి అయిండు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కారణంగా విపరీత పోకడలకు దారి తీస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నరు. డిసెంబరు 7తో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తికావొస్తుంది. అయితే, ప్రజలకు ఏమీ చేయలేదనే అసహనం వారినుంచి బయటపడుతోంది.అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం ఒరగబెట్టారని సంవత్సర పరిపాలన సంబురాలు చేసుకుంటున్నట్లు…?
రేవంత్… అసలు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి..? జై తెలంగాణ అని ఏనాడైనా ఉద్యమించినవా? తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసింది రేవంత్ రెడ్డి. ఉద్యమకారులపై, ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టింది నువ్వు.తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డిని సమాజం ఛీ కొట్టింది.రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.రేవంత్ లక్కీ లాటరీతో ముఖ్యమంత్రి అయిండు.
కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో యాత్రలు, పోరాటాలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. అనేకసార్లు అరెస్టయ్యారు. రేవంత్.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలి. తెలంగాణకు మోదీ ఏం చేశారంటూ గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే మాట్లాడిండు. ఆఖరుకు ఫాంహౌస్ కు పరిమితమయ్యిండు. రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ కు పట్టిన గతే పట్టే రోజులు దగ్గరపడ్డాయి.
ఆర్టీసీ కళ్యాణమండపం సాక్షిగా, జర్నలిస్టుల సాక్షిగా తెలంగాణకు, హైదరాబాద్ కు, సికింద్రాబాద్ కు కేంద్రం ఇచ్చిన లక్షల కోట్ల నిధుల గురించి అన్ని వివరాలతో కిషన్ రెడ్డి బహిరంగంగా వివరించిన్రు.రేవంత్ రెడ్డి.. మరోసారి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల గురించి అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా..? ఇంకెక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రంలో సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేసిన చరిత్ర బిజెపిది.ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ. 13 వేల కోట్లు ఇస్తే మొత్తం రుణమాఫీ పూర్తవుతుందని చెబితే… నిన్న పాలమూరు సాక్షిగా రూ. 3 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తంగా అబద్ధాల ప్రచారంతో ప్రజలను మాయ చేయాలని మరోసారి ప్రయత్నం చేస్తున్నారు.
2024 మార్చి 31 వరకు 64 లక్షల 90 వేల 228 మంది షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నారు. రైతు రుణమాఫీకి మొత్తం రూ. 79 వేల 387 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 22 వేల కోట్ల రూపాయలు ఇచ్చి, మొత్తం రుణమాఫీ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నది. రేవంత్ రెడ్డి ఒట్టు అంటే.. ప్రజలు తిట్టు అన్నట్లుగా భావిస్తున్నారు.
మొత్తం 41 సార్లు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రాజ్యాంగంలో 90 సవరణలు కాంగ్రెస్ హయాంలో జరిగినవే.కోర్టులను ప్రశ్నించడం,.. పార్లమెంటును ప్రశ్నించడం.. ఎలక్షన్ కమిషన్ ను, సీబీఐని, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ను తప్పుబట్టే నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
ల్యాండ్స్ గురించి, గుజరాత్ మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డికి.. రియల్ ఎస్టేట్ బినామీ భూముల విషయంలో ఆఫీసర్లకు ఏయే బ్రాండ్లు ఇవ్వాలో బాగా తెల్సు. గుజరాత్ లో మద్య నిషేధం ఉందా అని అడుగుతున్న రేవంత్ రెడ్డికి.. తెలంగాణలో డ్రగ్స్ నిషేధం ఉందని తెలుసా? రేవంత్ కు…. స్మగ్లింగ్ కు, నిషేధానికి, అధికారికంగా అమ్మకాలు జరపడానికి మధ్య తేడా తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నడు. ఇప్పటికైనా బిజెపి పట్ల, బిజెపి నాయకులపై మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం.