Suryaa.co.in

Telangana

రేవంత్.. చిల్ల‌ర‌ వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు

– ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌ ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌నాయిస్తున్న అక్ర‌మ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు.సీఎం రేవంత్ రెడ్డి దయచేసి తెలుసుకోండి. మేము కేసీఆర్ కి సైనికులం. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టింది. మీ చిల్ల‌ర‌ వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు. అవి మా సంకల్పానికి మ‌రింత బ‌లం చేకూరుస్తాయి పోరాటం మాకు కొత్త కాదు. అక్ర‌మ కేసుల‌తో మా గొంతుల‌ను నొక్క‌లేరు.

LEAVE A RESPONSE