Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరిని మోసం చేసిన మోసగాడు ఆర్కే

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

మంగళగిరిని మోసం చేసిన మోసగాడు ఆర్కే. దోపిడి లో జగన్ ని మించిపోయాడు. నాలుగేళ్ల లో సహజ వనరుల దోపిడి ద్వారా వందల కోట్లు కొట్టేసాడు. రెండు సార్లు గెలిపించిన నియోజకవర్గానికి మేలు చెయ్యకపోగా ఉన్న సహజ వనరులు యధేచ్ఛగా దోచుకుంటున్నాడు. ఉండవల్లి కొండ కి గుండు కొట్టాడు. కాజా చెరువు లో మట్టి దోపిడి, గిరి ప్రదక్షణ పేరుతో మట్టి దోపిడి.

ఇప్పుడు ఏకంగా నీరుకొండ క్వారీ వాటాల్లో తేడా వచ్చి వైసిపి నాయకులు నడి రోడ్డు మీద తలలు పగలుగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ఆర్కే దోపిడి, దౌర్జన్యాలకు అడ్డాగా మార్చేశారు.

 

LEAVE A RESPONSE