Suryaa.co.in

Entertainment

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పాటపై ఆర్.ఎమ్.పి డాక్టర్ల నిరసన

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య సినిమాలోని ఐటెం సాంగ్ ఇప్పుడు వివాదాస్పదం అయింది.  పాటలోని సాహిత్యం తమను అవమానపరిచే విధంగా ఉన్నాయని.. తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ.. ఏపీ ఆర్ఎంపి సంక్షేమ సంఘం నాయకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు హోం మంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గణపతి రావు మాట్లాడుతూ.. ఆచార్య సినిమాలో ఓ పాట ఆర్.ఎమ్.పి ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఆ సాంగ్ లో ఆడవారిని నెమరడానికే ఆర్.ఎమ్.పి లు అని వ్యగ్యంగా పాడారని.. కనుక ఈ పాటలో ఆర్.ఎమ్.పి లను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలు తొలగించాలని గణపతిరావు కోరారు.  తమ డిమాండ్ ని తెలియజేస్తూ.. హోం మంత్రి సుచరిత ను కలసి వినతి పత్రం అందచేశామని అన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఏపీలోని ఆర్.ఎమ్.పి ల ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరించాలని హోమ్ మంత్రి సుచరితను కోరినట్లు చెప్పారు.

అయితే ప్రప్రథమంగా ప్రకాశం జిల్లా నుండి ఆ పాటకు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపించాయి. తమను కించపరిచారని ప్రకాశంజిల్లా ఇంకొల్లు ఆర్ఎంపీలు గొంతు విప్పారు.ఆచార్య సినిమాలోని ఒక పాటను శుక్రవారమే విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో అందులోని ఒక చరణం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పాటలో ” స్త్రీని ఏడాడో నిమరొచ్చొని కుర్రోళ్లు ఆర్ఎంపీలయిపోతున్నారు” అని ఒక చరణం ఉందని ఇంకొల్లు మండలం హెల్త్ ఫస్ఎయిడర్ల సంక్షేమ సంఘం తెలిపింది.

ఇది ఆర్ఎంపీల మీద మీద ప్రజలకు దురభిప్రాయం కలిగించే చరణమని, తమ వృత్తి మీద కూడా దుష్ప్రభావాలు కలిగే ప్రమాదముందని సంఘం అధ్యక్షుడు రావినూతల శ్రీనివాసరావు తెలిపారు. తాము
chiranjeevi కూడా సీనియర్ వైద్యుల వద్ద శిక్షణ పొందాకే సొంతంగా వైద్యం చేస్తామని, ఆషామాషీగా చేసే వృత్తి ఇది కాదన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో తాము బాధ్యతగానే వ్యవహరిస్తామన్నారు.

అయితే తమను చిన్నచూపు చూసేలా, తమ వృత్తిని కించపరిచేలా ఉన్న ఈ చరణాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ శ్రీనివాసరావు నాయకత్వంలో సంఘం ట్రెజరర్ భాషా, సభ్యులు రాఘవరావు, ఆదంబాబు, కె శ్రీనివాసరావు తదితరులు ఇంకొల్లు తహసీల్దార్ కు వినతపత్రం కూడా సమర్పించారు. ప్రస్తుతానికి ఈ నిరసన ప్రకాశం జిల్లాకే పరిమితమైనా రానున్న రోజుల్లో రాష్ట్రమంతా వ్యాపించే అవకాశం లేకపోలేదు.

LEAVE A RESPONSE