అధ్వాన్నంగా రోడ్లు.. గజానికో గుంత… అడువేయలేని దుస్థితి

– దుగ్గిరాలపాడులో మొదలైన దేవినేని ఉమా పాదయాత్ర
– మూడేళ్ల వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని చూపి ప్రభుత్వ కళ్ళు తెరిపించేందుకు జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడులో పాదయాత్ర ప్రారంభించిన మాజీ మంత్రి దేవినేని ఉమా
– 14 కిలోమీటర్లు సాగనున్న పాదయాత్ర

దేవినేని ఉమా ఏమన్నారంటే.. జగన్ ప్రభుత్వానికి సమాధి కట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. రాష్ట్రంలో అధ్వాన్నంగా రోడ్లు.. గజానికో గుంత… అడువేయలేని దుస్థితి.. ఇది జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో రోడ్ల దుస్థితి. ఓ ప్రముఖ దినపత్రిక సర్వే ఆధారంగా 13 జిల్లాల్లో 287 కిలోమీటర్ల మేర పరిశీలన ప్రకారం మొత్తం గుంతలు 7010, సగటున కిలో మీటరు కు 24 గుంతలు ఉన్నాయని ప్రకటించారు. 9 గ్రామాల ప్రజలు గత మూడేళ్లుగా పడే ఇబ్బందులు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు.ఈ మూడేళ్లలో ఇక్కడ గుంతల్లో పడి ముగ్గురు చనిపోయారు.ఈ ప్రభుత్వాన్ని చూసి, వీళ్ళ మొహాలు చూసి కాంట్రాక్టర్లు కూడా పని చేయడానికి భయపడుతున్నారు. చెప్పాము… చెప్పాము… ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వానికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు ఉంది.టీడీపీ హయాంలో 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేయిస్తే మూడేళ్ళ లో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేయించారు?

రోడ్లు వేసే దిక్కులేదు పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది అన్ని రంగాల్లో వైఫల్యం.టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈ నెల 29న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బస చేయనున్నారు. టీడీపీ కృష్ణాజిల్లా అంగలూరు లో మహానాడు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.లక్షలాది మందితో గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. చంద్రబాబు బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. స్థానిక శాసన సభ్యులు చెబుతున్నాడు మాకు సమాధి కడతామని… మాకు కాదు ఈ జగన్ ప్రభుత్వానికి ప్రజల సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉంది. నా గురించి మాట్లాడే అర్హత ఈ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ కు లేదు.

Leave a Reply