రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో ముడిపడిన ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించారు. రీసెంట్ వచ్చిన వారి పోస్టర్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆంగ్లేయుల అరాచకాలు .. అడవి ప్రజల పట్ల వాళ్ల అమానుష కార్యాలు .. వాళ్లని ప్రశ్నించే వీరుడిగా కొమరం భీమ్ కనిపిస్తున్నాడు. ఆంగ్లేయుల తరఫున పోలీస్ అధికారిగా .. కొమరం భీమ్ తరఫున పోరాడే వీరుడిగా రెండు విభిన్నమైన గెటప్పులలో చరణ్ కనిపిస్తుండటం విశేషం.
‘తొక్కుకుంటూ పోవాలే .. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే’ అంటూ ఎన్టీఆర్ ఆవేశంతో చెప్పిన డైలాగ్, ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి’ అంటూ అజయ్ దేవగణ్ చెప్పిన
డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ ట్రైలర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నెల్లూరు జిల్లాలో 11 సినిమా థియేటర్లలో ట్రైలర్ రిలీజ్. జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ అభిమానులతో కిక్కిరిసిన సినిమా హాల్స్. బాణాసంచా పేల్చి, కేకులు కట్ చేసి సంబరాలు. M1 థియేటర్ లో రామ్ చరణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.
విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ట్రైలర్ ప్రివ్యూలతో విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా సృష్టించారు. ట్రైలర్ ప్రివ్యూను చూసేందుకు వచ్చిన అభిమానులు… ‘‘జై ఎన్టీఆర్…కాబోయే సీఎం ఎన్టీఆర్’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్నపూర్ణ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కట్ ఔట్‌కి కొబ్బరి కాయలు కొట్టి, పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
కాగా… థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హాల్ చల్ చేశారు. అభిమానులు తాకిడి తట్టుకోలేక సిబ్బంది థియేటర గేట్లు వేశారు. అయినప్పటికీ అభిమానులు గేట్లు దూకి లోపలకు వెళ్లారు.