Suryaa.co.in

Andhra Pradesh

6 లక్షలమందికే సున్నావడ్డీ కింద రూ.112కోట్లు ఇస్తున్నాడు

– చంద్రబాబునాయుడి ప్రభుత్వం సున్నావడ్డీ కింద ఏటా రైతులకు రూ.400కోట్లు ఇస్తే, ఈ ముఖ్యమంత్రి ఐదేళ్లకు కలిపి రూ.480కోట్లు మాత్రమే ఇస్తున్నాడు
– రాష్ట్రంలోని పచ్చని పొంటపొలాలను ముకేశ్ అంబానీపరం చేయడం కోసమే, రైతులను వ్యవసాయానికి దూరంచేస్తున్నాడు
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు అబద్ధాలకథనాన్ని అసత్యపు కథనాన్ని మీడియాముందు వండివార్చడమేకాకుండా, ఏడుస్తున్న ముఖంతో, బలవంతపు నవ్వుతో హావభావాలు పలికించాడని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఏడుపుముఖంతో, హృదయాంతరాలనుంచి రాని నవ్వుతో రైతులకు ఏదో చేస్తున్నామంటూ మోసపూరితమాటలు చెప్పే వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో నేడు ముఖ్యమంత్రిని చూస్తే అర్థమైంది. కోట్లరూపాయలను ప్రకటనలపేరుతో ధారాధత్తంచేయడానికే ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు కొత్తకొత్త అబద్ధాలుచెబుతున్నాడు. ఈరోజు పత్రికల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలుచూస్తే, ఇదివరకే ఆగస్ట్ లో రెండోవిడత వైఎస్సార్ రైతుభరోసా అనేది పైనపెడితే, కిందేమో అశ్వత్థామ హత: కుంజరహా: అన్నట్లు పీఎం కిసాన్ కిందజమచేసిన రూ.973కోట్లు పోను, మిగిలిన రెండోవిడత రైతుభరోసాసాయంతో కలిపి, రూ.1213కోట్లు నేడు రైతులఖాతాల్లో జమ చేసినట్లుగా జగన్ రెడ్డి చెప్పుకున్నాడు.
పీఎం కిసాన్ కింద జమచేసిన మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వాటా ఎంతఅని ప్రశ్నిస్తున్నాం. ఆగస్ట్ కు ముందు పీఎంకిసాన్ పథకం కింద ఒక్కోరైతుకి రూ.4వేలవరకు కేంద్రం జమచేసింది. ఇప్పటివరకు ఆ సొమ్మురైతులకుజమకాకుండా, వాడుకున్న జగన్మోహన్ రెడ్డి, నేడు అంతా తానేఇస్తున్నట్లు గొప్పగా పచ్చిఅబద్ధాలుచెప్పుకొచ్చాడు. ఇలా అబద్ధాలు చెప్పబట్టే, ముఖ్యమంత్రి ముఖంలో ఏడుపు, నవ్వు కలగలసి కనిపిస్తున్నాయి. సున్నావడ్డీ కింద ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 6లక్షల మంది రైతులకు రూ.112కోట్లు ఇస్తున్నాడు. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులుంటే, ముఖ్యమంత్రి అరకొరగా ఇస్తున్నదికేవలం 6లక్షలమందికే. వైఎస్సార్ యంత్రపరికరాలపేరుతో 1720 రైతుగ్రూపులకు, రూ.25.55 కోట్ల లబ్ధితో, యంత్రపరికరాల కేంద్రాలకు రిబ్బ న్లు కట్టేపనికి ముఖ్యమం త్రి శ్రీకారంచుట్టాడు. అంతేతప్ప ఎక్కడా రైతులకు ఎలాంటిపరికరం రాయితీపై ఇవ్వడంలేదు. దానికోసం రైతులకు పెద్దపెద్ద కట్టుకథలు చెప్పడం. గతప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.1100కోట్లు తానే చెల్లిస్తు న్నట్లు ఈ ముఖ్యమంత్రి చెబుతున్నాడు.
గతప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 4పంటకాలాలకు రైతులు తీసుకున్న రుణానికి సంబంధించి రూ.631కోట్లను అప్పుడే చెల్లించారు. తరువాత రూ.1080 కోట్లు చెల్లించాల్సిన తరుణంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవ డం జరిగాయి. రూ.1700కోట్లవరకు టీడీపీప్రభుత్వం సున్నావడ్డీ కింద రైతులకు చెల్లిస్తే, దానిలో రూ.300కోట్లు ఇదివరకు ఇచ్చాను… ఇప్పుడు రూ.112కోట్లు ఇస్తున్నానని ఈ ముఖ్యమంత్రి చెబుతున్నా డు. రూ.1700కోట్లకు సున్నావడ్డీ కింద చంద్రబాబునాయుడు గారు ఏటా రూ.400కోట్లు చెల్లిస్తే, ఈ ముఖ్యమంత్రి మూడేళ్లకు గాను రూ.480 కోట్లు ఇస్తున్నాడు. అదికూడా ఏడుపుగొట్టు ముఖం పెట్టుకొని .. కేవల ఏదోఒకపేరుచెప్పి అబద్ధాలుచెప్పడానికి, పత్రికల్లో డబ్బాలు కొట్టుకోవడం తప్ప, ఈ ముఖ్యమంత్రి చేస్తున్నది శూన్యం.
దీపావళి కాంతులంటూ పెద్దపెద్ద ప్రకటనలు ఇవ్వడంతప్ప, వాస్తవానికి రైతులజీవితాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాంతులు ఎక్కడున్నాయి? 2020 డిసెంబర్ 26నకూడా రైతులకు ముందే సంక్రాంతి వచ్చిందంటూ జగన్మోహన్ రెడ్డి, ఇదేమాదిరి అప్పుడు కూడా మీటనొక్కాడు. కానీ ఆ మీటతాలూకా సొమ్ము, ఎప్పుడో ఫిబ్రవరిలో రైతులకు చేరాయి. ఇప్పుడుకూడా దీపావళికి కాంతులు అంటున్నాడు ….కేంద్రప్రభుత్వం ఆగస్ట్ లో ఇచ్చిన సొమ్ముని ఇంతవరకు రైతులకు ఇవ్వకుండా, అత్తసొమ్ము అల్లుడుదానంచేసినట్లుగా అంతా ఆయనే చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు.
జగన్మోహన్ రెడ్డి ఈరోజు నొక్కిన మీట కేంద్రప్రభుత్వం తాలూకా సొమ్ముకి సంబంధించినది. ఆయన మీటలునొక్కడం, మాటలుచెప్పడం ఎలా ఉంటుందో తిత్లీ తుఫాను సమయంలో రైతులకు ఇచ్చిన హామీల్లా నే ఉండిపోయాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిత్లీ తుఫానుతో నష్ట పోయిన రైతులకు అధికారంలోకివచ్చాక ముఖ్యమంత్రిచేసిన సాయం, ఈనాటికీ రైతులకు అందలేదు. ఇప్పటికీ అవి తాడేపల్లి నుంచి శ్రీకాకుళా నికి పోతూనే ఉన్నాయి.
విద్యుత్ సంస్కరణలపేరుతో మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా నాణ్యమైన విద్యుత్ కోసమే ఆపనిచే స్తున్నానన్నాడు. ఇప్పుడు కూడా ఫీడర్లు ఏర్పాటుచేస్తున్నది నాణ్య మైన విద్యుత్ కోసమే అంటున్నాడు. ఇలా ఎన్నాళ్లూ నాణ్యమైన విద్యుత్ పేరుతో రైతులకు పంగనామాలు పెడతాడు ఈ ముఖ్యమంత్రి? ప్రభుత్వ అనేది ఒకప్రహాసనం. దానిలో అప్పులు, ఆస్తులు, ప్రకృతి వైప రీత్యాలు వస్తుంటాయి. అన్నింటినీ తట్టుకుంటూ, ముందుకు పోవడమే ప్రభుత్వపని. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదిచేసినా తనస్వార్థానికి చేస్తూ, అంతా ప్రజలకోసం చేస్తున్నానని చెబుతున్నాడు. రూ.36వేలకోట్లు ధాన్యం బకాయిలకు, రూ.300కోట్లు పత్తికొనుగోళ్లకు, సుమారుగా రూ. 7వేలకోట్లు ఇతరధాన్యాల కొనుగోళ్లకు, మొత్తం సుమారుగా రూ.45వేల కోట్లు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నాడు.
ఒకరైతు ఆరుగాలం నెత్తురుని చెమటగామార్చి, ఎండకు, వానకు వెరకుండా పంటపండిస్తే, దాన్నికొన్న ప్రభుత్వం ఆ డబ్బులు రైతులకు స్తూ, సాయమనిచెబుతుందా? దానికి మరలా ఏడుపుగొట్టు ముఖం. ఒక రైతు తన పంటఉత్పత్తులను షావుకారులు, వ్యాపారులకు అమ్ము కుంటే, వారు డబ్బులిస్తే, అదిసాయం అవుతుందా? ఈ విధంగా జగన్ రెడ్డి ఇన్ పుట్ సబ్సిడీల్లో, రైతుభరోసాల్లో అన్నింట్లో రైతులను మోసగి స్తూనే ఉన్నాడు. చంద్రబాబునాయుడు అసెంబ్లీలో మీ సెక్యూరిటీ సిబ్బంది కాళ్లవద్ద రైతులకు అందించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమాసొమ్ముకోసం కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు ఆయన .. తన సొంతప్రయోజనాలకోసమా? కాదు, ఈముఖ్యమంత్రి రైతులకు పంటలబీమా సొమ్ము ఇవ్వకపోతే కూర్చున్నాడు.
ఆయన అలా కూర్చున్నాకూడా రైతులకు ఈ ప్రభుత్వం ఏడుస్తూ, పంటలబీమా సొమ్ముఅందించినా, స్థానిక వైసీపీనేతలు ఆ సొమ్ము రైతులకు దక్క కుండా చేశారు. ఒక ఎకరా వరిపండించడానికి నేడు రైతులకు అధికంగా ఖర్చు అవుతుంటే, రైతుకు ఇచ్చే సాయం ప్రభుత్వం పెంచాలి. గతప్రభుత్వం వరికిఇన్ పుట్ సబ్సిడీ రూ.20వేలు ఇస్తే, కానీ ఈ ముఖ్యమంత్రి దాన్ని రూ.15వేలకు కుదించాడు. ప్రతిపక్షం ఏమైనా అడిగితే ఇచ్చుకుంటూ, పెంచుకుంటూ పోతానంటాడు.
ప్రజలను మరీ ముఖ్యంగా రైతులను ఈ విధంగా మోసగించడం జగన్మో హన్ రెడ్డికే సాధ్యమైంది. పీఎం కిసాన్ కింద కేంద్రప్రభుత్వం ఆగస్ట్ లో రైతులఖాతాలకు జమచేసిన డబ్బులను, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇస్తూ, దానికే గొప్పలుచెప్పుకుంటున్నాడు. అమాయకపు మాటలు, దొంగ చిరునవ్వుతో అంతిమంగా రైతులను వ్యవసాయానికి దూరం చేసి, పచ్చని భూములను తనకు నచ్చిన , మరీ ముఖ్యంగా ముకేశ్ అంబానీకి కట్టబెట్టాలన్నదే ముఖ్యమంత్రి అంతిమధ్యేయం.
అదే ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ గతంలో తనతండ్రిని చంపాడని ఈ జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టాడు. మరిప్పుడు అదే అంబానీకోసం రాష్ట్ర రైతాంగాన్ని రోడ్డునపడేయడానికి సిద్ధమయ్యాడు. అధికారంలోకి వచ్చాక తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనే విషయాన్ని జగన్మోహ న్ రెడ్డి విస్మరించాడు. తనా పాతస్వభావాలనే ప్రదర్శిస్తూ దొంగలా, నేరస్తుడిలానే ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యమంత్రికి తెలియకపోతే, వ్యవసా యరంగ నిపుణులతో చర్చించైనా అన్నదాతలకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అన్నదాత సుఖీభవ కింద గతప్రభుత్వం రూ.15వేలు రైతులకు ఇస్తే, తాను అధికారంలోకి వస్తే రూ19వేలుఇస్తా నని జగన్ నమ్మించి, వారిని వంచించాడు. బాధ్యతగల వ్యక్తిగా ముఖ్యమంత్రి వ్యవసాయరంగాన్ని, రైతులను మోసగించడమనే చర్యల కు తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్న ఆర్ బీకేల (రైతుభరోసాకేంద్రాలు) బండారం బయటపెట్టడానికి, వాటిని ముట్టడించడానికి రైతాంగం సిద్ధమవుతోంది.

LEAVE A RESPONSE