Suryaa.co.in

Andhra Pradesh

రైతు ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్

మూడు పథకాల కింద రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన సీఎం జగన్‌
అమరావతి: వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగు కోసం వైఎస్సార్‌ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమై తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 40 శాతం సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది.

LEAVE A RESPONSE