Suryaa.co.in

Features

పూర్తి స్వాతంత్రం సాధించడంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ హెడ్గేవార్ పాత్ర

మొదటినుండి ఆర్ఎస్ఎస్ , హిందూ మహాసభల మధ్య తేడాలు ఉండేవి .ఆర్ఎస్ఎస్ సహాయ నిరాకరణ ఉద్యమానికి దూరంగా ఉండాలని డాక్టర్ బి.ఎస్ ముంజే భావించారు. చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దిన వారు డాక్టర్ ముంజే విద్యార్థి దశలో డాక్టర్ హెగ్డేవార్ కు ఎంతో సహాయం చేశారు. అయినా డాక్టర్ ముంజే (హిందూ మహాసభ) సలహాను సున్నితంగా తోచిపుచిన డాక్టర్ హెడ్గేవారు తాను అనుకున్న మార్గంలోనే వెళ్లాడు. ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా చివరి వరకు డాక్టర్ ముంజేతో సత్సంగ్ కొనసాగించారు.

1931 సహాయ నిరాకరణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజుల్లో లండన్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆహ్వానం అందుకున్న డాక్టర్ ముంజే వాటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ ముంజే కు ఆహ్వానం అందడం పట్ల ఉద్యమ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత వ్యక్తం అయింది.ఆ సమయంలో జైలులో ఉన్న డాక్టర్ హెడ్గే వార్ రాజకీయ విభేదాలు ఎన్నైనా ఉండవచ్చును కానీ వాటిని చౌకబారుగా, ద్వేషపూరితంగా వ్యక్తం చేయడం తగదు .ఎన్ని విభేదాలు ఉన్నా అవతల వారి దేశభక్తిని ,నిష్టను శంకించాల్సిన పనిలేదు ఎవరి మార్గంలో వారు పనిచేస్తూ పోవాలి అని తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు .

ఒకసారి గాంధీ ,సావర్కర్ లలో ఎవరు గొప్ప అని చర్చి వచ్చింది చర్చిస్తున్న వారు డాక్టర్ హెడ్గేవార్ వారు ను మీ అభిప్రాయం ఏమిటి ? అని అడిగారు అప్పుడు డాక్టర్ జి ఈ చర్చ’ గులాబీ గొప్పదా మల్లెపువ్వు గొప్పదా ‘ అని అడిగినట్లు ఉంది దేని గొప్పదనం దానిది .మనం మన ఆలోచనలు అభిరుచిని బట్టి ఏదో ఒకటి నచ్చుతుంది నచ్చని పువ్వును నాశనం చేసి నచ్చిన దాని అందాన్ని మాత్రమే ఆస్వాదించాలి అనుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏదైనా పువ్వు అని సమాధానం ఇచ్చారు . భిన్నాభిప్రాయాలను, ధోరణలను సమన్వయం చేయగలిగిన దృష్టి ఆయనది .

హిందూ మహాసభ తో భేదాలు ఉన్న 1935 డిసెంబర్ 30న పూనాలో జరిగిన ఆ సంస్థ సమావేశాల్లో 500 మంది గణవేషి దారి స్వయంసేవకుల కవాతును ఆయన నిర్వహించారు. ఆరోగ్యం బాగా లేకపోయినా పూర్తి విశ్రాంతి అవసరమైన డాక్టర్లు చెప్పినా డాక్టర్ హెడ్గేవార్ పూనాకు వెళ్లారు. ఆ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యం గురించి డాక్టర్ ముంజే సంస్థ ప్రతినిధులకు వివరించారు నేటి కలుషిత రాజకీయ వాతావరణం లో భిన్న దృక్పథాలు కలిగిన రెండు సంస్థల మధ్య అంతటి సయోధ్య సాన్నిహిత్యం ఇప్పుడు ఊహించలేం. నేను పెడుతున్న ఈ పోస్టు స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్ అనే పుస్తకం ఆధారంగా

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE