Suryaa.co.in

Political News

నితీశ్ నిలబడగలడా ?

రాబందు ఎవరికీ బంధువు కాదు. పైపైనే తిరుగుతోందీ అంటే స్నేహంతో కాదు. అదును కోసం ఎదురు చూస్తోంది అని అర్థం. ఊపిరి పోవాలని కోరుకుంటుంది. అవకాశం వస్తే పొడిచి పొడిచి చంపుతుంది. మొన్నీమధ్య మహారాష్ట్రలో చంపినట్టు ! ఇక త్వరలో జార్ఖండ్ లో, దాని తల్లి రాష్ట్రం బీహార్ లోనూ ఇలాంటి సన్నివేశం కనపడబోతోంది. ఆల్రెడీ అక్కడ నీడ పడింది. డబ్భై కి అటు ఇటుగా సీట్లతో దర్జాగా ఉండే నితీశ్ ని 40కి లాగి నేల నాకించేసింది ఈ రాబందు. ఇప్పుడు జేడీయూని చీల్చి కూల్చాలని ఆత్రం. జార్ఖండ్ లోనూ అంతే ! హేమంత్ సర్కార్ అంతం కోసం పంతం.

మిగతా పార్టీలుంటే ఓర్వలేని కుత్సిత కురచ బుద్ధి. ఏజ్ గుంజేశాక ఛప్పన్ ఛాతి లెక్క చెప్పడం లేదు కానీ కూలదోసే కుతంత్రాలు మాత్రం ఆగడం లేదు. పోనీ వీళ్లొచ్చి పొడుస్తారా అంటే అదీ లేదు. లక్షల కోట్లు అప్పులు చేస్తారు. యూపీ లాగా ! కేంద్రం లాగా ! అప్పుల మీద బతికే అర్భకులకి అడ్డంగా వత్తాసు పలుకుతారు. దూరదృష్టి ఉండదు. దుష్టత్వం తప్ప ! ఇలాంటి వాళ్లు నీతులు చెబుతారు సినిమాకు ముందు టొబాకో ట్రైలర్ వేసినట్టు !

అన్నట్టు వీళ్లతో కలిసినోడు నిలిచి లేడు ఎవ్వడూ ! కశ్మీర్ లో పీడీపీ మొదలు అకాలీ వరకూ … అందరిదీ అదే ఘోష. పరోక్షంగా కలిసి పబ్బం గడుపుకుంటున్న తెలుగు అధికార పార్టీలకు త్వరలోనే తెరపడే రోజులు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ల దత్తపుత్రుడు ఉత్తదే అని తేలిపోయేసరికి లెక్క మారుతోంది అంతే ! ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తోక తెగితే ముడివేసే దిక్కులేదు. అందుకే కొత్త ప్రయత్నాలు. ఉన్నోళ్లని కూల్చడం, మునిగే చోట కొత్త తెప్పలు వెదుక్కోవడం అనమాట. ఇదే ఎనిమిదేళ్ల హిస్టరీ.
#రాజనీతి

LEAVE A RESPONSE