రామా అంటే ..!

చంద్రబాబునాయుడు …ఈయన అత్యంత అదృష్టవంతుడు..! అదే సమయంలో దురదృష్టం నీడలా వెన్నంటే ఉంటుంది. మాటలు తూకం వేసి మాట్లాడే ఈయన మాటలు! ఈయన ఆలోచనలు..విధానం …విజన్..! భవిష్యత్తులో ..అందరూ మాట్లాడతారు…ఈయన ఇవాళ ఆలోచిస్తే రేపో ఎల్లుండో దేశం..ప్రపంచం ఆలోచిస్తుంది…అలాగే ఈయన విజన్..కూడా..! ఈయన రామా అంటే మాత్రం…బూతులా వినిపిస్తుంది..!

వ్యవసాయం లాభసాటిగా లేదు..ఇతర మార్గాలు వెతుక్కోవాలి అంటే..! దండగ అన్నాడని హోరెత్తించి ..ఊరేగించారు..! ఏం వ్యవసాయం దండగ అనిపించటం లేదా!? ఇప్పుడందరూ గుడ్ల నీరు కక్కుతూ అదే అంటున్నారు! ధర ఉంటే పంట ఉండదు…పంట పండితే ధర ఉండదు…వ్యవసాయ ఉత్పత్తులు రోడ్డు పాలు చేస్తున్న దృశ్యాలు నిత్యం చూస్తూనే ఉన్నాం..!

అలాగే రెండుకళ్ళ సిద్దాంతం …ఇదేమాట అనేక రాజకీయపార్టీలు మాట్లాడాయి. కొందరు ఒంటికన్ను ..మంద బుద్దులు తప్ప..! ఇంకుడు గుంతలు..పనికి ఆహారం..జన్మభూమి పేర్లు మారినా …ఇప్పటికీ మంచి కార్యక్రమాలే! అమరావతి నిర్మాణాలు…తాత్కాలికం అన్న మాట ను పట్టుకుని …ఆయన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నాలు ఇప్పటికీ ఆగలేదు. నిర్మాణాలు శాశ్వతం..అందులో నిర్వహించే కార్యక్రమాలు తాత్కాలికం అన్నది వివరంగా చెప్పుకోలేక పోయారు..! అది అర్దం చేసుకోలేనంత సన్నాసులనుకోలేదేమో! రాజధాని ప్రాంత రోడ్లు…నిర్మాణాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ..!
ఇంకా పచ్చి అబద్దాలు మాట్లాడే వారు ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారో అర్దం అవుతుంది..! ఇక్కడ చులకన అన్న మాట కంటే ఇంకా తీవ్రమైన పదజాలం వాడాలి..ఎర్రి## # చూస్తున్నారన్నమాట.

ఐదేళ్ళ లో పూర్తి చేసేయ్యాలి కదా! అంటున్నారు.. భూ సమీకరణ అడ్డుకున్నారు…రైతుల మధ్య చిచ్చు పెట్టాలని చూసారు…కోర్టుల్లో కేసులు వేసారు..! ఎన్జీటీ ద్వారా అడ్డుకోవటానికి చూసి కాలం వృధా అయ్యేలా చేసిన …బొలిసెట్టి సత్యనారాయణ లాంటి జనసేన నాయకుడు కూడా …ఐదుసంవత్సరాల్లో ఏమీ జరగలేదని టీవీల్లో పేలతాడు. నాలుగేళ్ళు అంటకాగిన బీజేపి వాళ్ళు అదే కూత కూస్తారు..! వైసీపి వాళ్ళంటే..అవివేకులు..విద్య తక్కువ ..ప్రత్యర్దులు కాబట్టి చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడతారు..! అసత్యాలు ప్రచారం చేస్తారు…ఆరోపణలు చేస్తారు.

మరి జనసేన..బీజేపి ..ఇతర మేధావులకి ఏమైంది.. వైసీపి..టీడీపి ని ఒకేగాటన కట్టడం ..! రెండుకళ్ళ సిద్దాంతమే కదా!! చంద్రబాబు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో..! ఏ నాయకులను దగ్గర కి తీసుకుంటారో..! ఏ పార్టీ తో పూసుకోవాలనుకుంటారో..! ఏ వర్గాలకు ఎక్కువ మేలు చేయాలనుకుంటారో..! ఏ అధికారులకి స్వేఛ్చ ఇస్తారో..! వారు ఆయనకి విప్పి చూపించి పచ్చి బూతులు తిడతారు..! పోతా పోతా చేతికందినంత పెంట చల్లేసి పోతారు..! ఇది ఆయన దురదృష్టం..!

ఇక ఆయన ..పార్టీ సంక్షోభం ఎదుర్కున్నపుడు..! పార్టీ కి గుదిబండలు గా ఉన్నవారు తమంతట తాము దూరంగా జరిగిపోతారు..! పార్టీలో చాలామంది సీనియర్లు..అసూయ తోనో..అసంతృప్తి తోనో..చంద్రబాబు కి అడ్డం లేకుండా కనుమరుగైపోతారు..! ఆఖరుకి ..పార్టీ ఆవిర్భావం తర్వాత…అత్యంత ఘోరంగా ఓడిపోయి..! దాడులతో ..వేధింపులతో నాయకులు..కార్యకర్తలు చెల్లాచెదురవుతున్నపుడు..! జీరో ఓటు బాంక్ ..దానికి కొంచెం అధికం అయిన రెండు జోగి పార్టీలు..ఏకమై బూడిద రాల్చుకుంటూ
అధికారంలోకి వచ్చేస్తామంటూ…ప్రజలకు బోల్డంత వినోదం పంచుతున్న వేళ..! ఎలా గెలిచారో ఏమో ..సూపర్ విక్టరీ సాధించిన వారు..! వారి గొయ్య వారు తవ్వుకుంటూ..! ప్రతిపక్షాలు దేని మీద పోరాటం చెయ్యాలో తెలియనంత ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..! ఎవరు తమకండగా నిలిచారో వారిని చావగొట్టి చెవులు మూసేస్తుంటే..! బీజేపి ..జనసేన లాంటి పార్టీలకు ..రాష్ట్రంలో బలపడే ఛాన్సు వచ్చినా ..వారు సిరి రా మోకాలడ్డిన చందాన ..పిల్లిమొగ్గలేయటం..!

గత మూడేళ్ళు గా..ఎదురైన విపత్తులు..అభివృద్ది లేమి..పాలన వ్యవహారం…అరాచకం..అధిక ధరలు..ప్రతి రోజు ప్రజలు చంద్రబాబు ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు..! ఇవన్నీ కళ్ళెదుట కనిపిస్తున్నా..! కేంద్రం ..రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాలు..చంద్రబాబు ని విమర్శించటం..హేళన చేయటం..దూషించటం తో సరిపెడుతున్నారు..! ఇది కచ్చితంగా చంద్రబాబు అదృష్టమే!

ప్రజలు మాత్రం ఆయన విలువ తెలుసుకుంటున్నారు…ఆయనకు వరమాల వేయక తప్పదు..! నిజానికి ఆయన ఓడిపోలేదు..ప్రజలే ఓడిపోయారు..! ప్రజలు ఓటమి నుండి కఠినమైన ..అత్యంత క్లిష్ట పరిస్దితుల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. గతంలాగే…ప్రస్తుతం..భవిష్యత్తులో కూడా చంద్రబాబు ..రామా అంటే బూతులాగే వినిపిస్తుంది. ఇది మాత్రం ఆయన్ని వదలదు..! ఆయన పేరు తారకమంత్రం..! నిత్యం జపిస్తూనే ఉంటారు..!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

Leave a Reply