Suryaa.co.in

Political News

వైసీపీ ఓటమికి కారణాలు ఇవే!

30 సంక్షేమ స్కీములు రద్దు చేసినప్పటికీ, వైసీపీకి ఏమి ఆశించి ఓటు వేశారో ఆలోచించండి. మత మౌడ్యానికి గురికాకుండ ఇప్పటికైనా బుద్దిని ఉపయోగించండి.

1. ఆదిపత్య కులాల కార్పొరేషన్లకు 7వేల కోట్లు కేటాయించి, ఎస్సీఎస్టీబీసీ,మైనార్టీ
కార్పొరేషన్లకు కనీసం ఒక్క రూపాయి కేటాయించకపోవడం.
2. అనంతబాబు, తోట త్రిమూర్తులు లాంటి క్రిమినల్స్ ను ప్రోత్సహించి నందుకే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం.
3. దళితులపై జరిగిన భయంకరమైన హత్యలే వైసీపీ ఓటమికి కారణం.
4. బటన్ నొక్కి డబ్బులు వేయడం వలన గెలవరని తేలిపోయింది. ఉచితాల వలన ఎలాంటి ప్రయోజనం లేదని వైసీపీ ఓటమి ద్వారా నిరూపణ అయింది.
5. కొంతమంది ఐఏఎస్ పరిపాలన నిర్వాకం వల్లనే ఓటమికి మరొక కారణం.
6. జిల్లాలు శాస్త్రీయంగా విడగొట్టకపోవడం వల్లనే ఓటమికి మరొక కారణం.
7. వైసీపీని గెలిపించేందుకు పార్టీలు పెట్టి, ఇండిపెండెంట్ల పోటీ వలనే ఓటమికి మరొక కారణం.
8. అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చినందుకే ఓటమికి మరొక కారణం.
9. హైకోర్టు తీర్పును ధిక్కరించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను కొనసాగించకుండా చేసినందుకే ఓటమికి మరొక కారణం.
10. ఉపాధ్యాయులను వేధించినందుకే ఓటమికి మరొక కారణం.
11. బహుజనులకు ప్రాథమిక విద్య నుండి అత్యున్నత విద్య వరకు చదవనీయకుండా అడ్డుకొన్నందుకే ఓటమికి మరొక కారణం.
12. వైద్య విద్యలో బీసీ ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు సరైన రిజర్వేషన్ కల్పించకపోవడం ఓటమికి మరొక కారణం.
13. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల గతిస్థితే ఓటమికి మరొక కారణం.
14. పేదల ఉసురు తగిలే జగన్ ఓటమి చెందారు.
15. తాగుబోతులు తమకు నాణ్యమైన మద్యాన్ని అందించకపోవడం వల్లనే వారు ఓడించారు.
16. ప్రభుత్వ వైద్యాన్ని నాశనం చేయడం వలన వైసీపీ ఓడిపోయింది.
17. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ప్రభుత్వ ఉద్యోగులతో శతృత్వం. ఈ రెండే జగన్ కొంప ముంచాయి.

ఏ మనిషైనా తమ జీవితకాలంలో చేసిన తప్పొపులకు ప్రతిఫలాలను ఈ జీవితకాలంలోనే పొందుతారు. మనువాది జగన్మోహన్ రెడ్డి విషయంలో అది తేటతెల్లమయింది. మణిపూర్లో క్రైస్తవులను అత్యంత దారుణంగా చంపినప్పటికీ నోరు మెదపకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గుడ్డిగా మద్దతు ఇచ్చాడు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినప్పటికీ, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకపోయినప్పటికీ, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకొన లేకపోవటం వలన, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకపోవడం వలన, లక్షల కోట్ల అవినీతికి పాల్పడం వలన, ఆంధ్రప్రదేశ్ అప్పులు నేటికీ పది లక్షల కోట్ల రూపాయలకు దాటి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అత్యంత దిగువున ఉంది కనుకనే జగన్ ఓటమి చెందారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతుందో లేదో భవిష్యత్తులో చూద్దాం.

– శ్రీహరి

LEAVE A RESPONSE