Suryaa.co.in

Andhra Pradesh

ఆర్‌ఎస్ఎస్ ఫాసిస్ట్ ఆర్గనైజేషన్

– ఆర్ఎస్ఎస్ పార్లమెంటు కు ఏమైనా జవాబుదారీనా?
-అంబానీ ,ఆదానీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు
– సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
– విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభల ప్రతినిధుల సభ
– మూడు రోజులపాటు మహాసభలు

విశాఖపట్నం : ఆర్‌ఎస్ఎస్ ఫాసిస్ట్ ఆర్గనైజేషన్.ఆర్ఎస్ఎస్ పార్లమెంటు కు ఏమైనా జవాబుదారీనా? కానీ దేశాన్ని పూర్తి గా పాలిస్తోంది ఆర్ఎస్ఎస్ మాత్రమే. బిజేపి రైట్ వింగ్ షిఫ్ట్ కోసం పని చేస్తోంది. ముస్లిం , క్రిస్టియన్, కమ్యునిస్ట్ లను శత్రువులుగా చూస్తోంది కార్పొరేట్ సంస్ధలను పోషిస్తోంది బిజేపి. అంబానీ ,ఆదానీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు.లౌకిక ప్రజాస్వామ్య వాదులు ఏకం కావాలి. కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది.

కాంగ్రెస్ పొలిటికల్ రిజల్యూషన్ మా రాలి. బిజేపి దూకుడుగా వెళుతోంది.‌ ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు విధానాలు ఏంటి.? పరిస్ధితి లు డిమాండ్ చేస్తున్నాయి…లౌకిక ప్రజాస్వామ్య విధానాలు రావాలి. వామపక్షాలతో కలిసి ప్రాంతీయ పార్టీలు కలిసి పోరాటం చేయాలి. వామపక్షాలు కలిసి బలమైన శక్తిగా ఎదగాలి. సిద్ధాంత పరంగా కలవాల్సిన అవసరం వుంది. 2024 ఎన్నికల్లో బిజేపి ని ఓడించడమే అందరి లక్ష్యం కావాలి.ఇది పొలిటికల్ స్లోగన్ కాదు…ఒక డిమాండ్ కావాలి.

LEAVE A RESPONSE