– చదువుకునేందుకు విద్యార్థులకు బ్యాంక్ ల నుండి లోన్ రావడం లేదు
– ఆదాని కి బ్యాంకు ల నుండి కోట్లు రూపాయల లోన్స్ ఇస్తున్నారు.
-దేశంలో బీజేపీ పొలిటికల్ బిజినెస్ చేస్తుంది
– సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య
విజయవాడ : దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపారస్తులకు దోచిపెడుతున్నాడు. దేశాన్ని ఆదాని, రిలయన్స్ ఇద్దరకు మాత్రమే దోచుకుంటున్నారు. దేశాన్ని బిజెపి నాశనం చేస్తుంది. రాష్ట్రాలను బిజెపి తన చెప్పుచేతలలో పట్టుకునేందుకు ప్రయత్నస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం సృష్టి నాశనం చేస్తున్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి ప్రాంతీయ పార్టీ ను ఏకం చేసి బిజెపికు చుక్కలు చూపించాడు దేశం వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.ప్రజల రక్తాన్ని పిండేస్తున్నారు. చదువుకునేందుకు విద్యార్థులకు బ్యాంక్ ల నుండి లోన్ రావడం లేదు. కానీ ఆదాని కి బ్యాంకు ల నుండి కోట్లు రూపాయల లోన్స్ ఇస్తున్నారు. భారత దేశం ఇలాగే ఉంటే భారతదేశం మొత్తం మరో శ్రీలంక అవుతుంది.
భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ కంపెనీలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేటు పరం చేయడం దుర్మార్గుమైన చర్యలు.దీని వల్లన అనేక నష్టం జరుగుతుంది. ప్రభుత్వం చేయలేనిది ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారు? దేశంలో ఇండియన్ రైల్వే లో లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయి. నరేంద్ర మోడీ రైల్వే ను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు.
ఇండియన్ ఆర్మీ ను కూడా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మీ లో అగ్నిపధ్ కాంట్రాక్ట్ సర్వీసు అనేది ఇక భారీ కుంభకోణం. దేశంలో ప్రజలందరూ ప్రైవేటు వ్యక్తుల చేతులో పెట్టడమే బీజేపీ ముఖ్య లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఉన్న యువకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసే రోజు దగ్గర కు వస్తుంది.
దేశంలో ఉన్న కొంతమంది ముఖ్య మంత్రుల టెలిఫోన్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ చేస్తున్న పను ల కు విగిపోతున్నారు. త్వరలో దేశ వ్యాప్తంగా రెవల్యూషన్ వస్తుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అల్లాడుతున్నారు. కార్పొరేట్ శక్తి లకు మాత్రమే నరేంద్ర మోడీ పని చేస్తున్నారు. సామాన్య, మద్య తరగతి ప్రజలను పక్క పెట్టారు.
చిన్న పార్టీ లను భయపెట్డి దేశ వ్యాప్తంగా బీజేపీ రాజ్యమేలాలని చూస్తుంది. దీనికి పోలీసులను, సిబిఐను వాడుకుంటున్నారు. బిజెపి సీబీఐను కూడా నాశనం చేసింది. దేశంలో బీజేపీ పొలిటికల్ బిజినెస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పార్టీ పాలించింది. కానీ గ్రామీణాభివృద్ధి అనేది జరగదు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశం పూర్తిగా వెనుకపడిపోయింది. ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు అనే జరగలేదు.
దేశంలో బిజెపి ప్రభుత్వం వల్లన జైలు లో ఉన్న రాక్షసులు అంతా బయటకు వస్తున్నారు. పార్లమెంటు మీద దాడి చేసిన అబ్జల్ గురువు దుర్మార్గులు ఉన్నారు. దేశంలో ముస్లిం పై నరేంద్ర మోడీ దుర్మార్గుంగా వ్యవహరిస్తారు. నరేంద్ర మోడీ వల్ల దేశాని చాలా నష్టం జరుగుతుంది. దేశం బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాంతీయ పార్టీ లో పొత్తులు పెట్డుకుని, ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యే లను, ఎంపిలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొంటున్నారు. దాని వల్లన దేశాని చాలా నష్టం జరుగుతుంది.