హక్కుల సాధన కోసం ఓబీసీ ఏకం కావాలి

-సోషల్ జస్టిస్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ కోఆర్డినేటర్ జి. కరుణానిధి

సకల సామాజిక రంగాల్లో చట్ట ప్రకారంగా రావాల్సిన వాటా సాధనతో పాటు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ రంగాలతో పాటు చట్ట సభల్లో ఒబిసి లకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటి ఫర్ సోషల్ జస్టిస్ మిగతా సంఘాలను కలుపుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఓబీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పరి చిన్నయ్య అధ్యక్షతన జరిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటి మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 15(4) ప్రకారం అణగారిన వర్గాలకు విద్యలో రిజర్వేషన్లు, ఆర్టికల్ 16(4) ప్రకారం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం దుర్మార్గమని అన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని విద్యా సంస్థల్లో ఓబీసీ లకు సున్నా(0) రిజర్వేషన్లు ఉన్నాయని, అణగారిన వర్గాలకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ రిజర్వేషన్లు తమిళనాడు రాష్ట్రం అందిస్తుందని అధికారం ద్వారానే రిజర్వేషన్ల సాధన జరుగుతుందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు డిమాండ్ చేయాలంటే కుల జనగణన అవసరమని, అలాంటి కుల జనగణనను ఎస్సి, ఎస్టీ, మైనార్టీల జనగణన చేపడుతున్న ఒబిసి ల జనగణన చేపట్టడం లేదని బ్రిటిష్ పాలనలో 1931 లో చేసిన కుల జనగణన తర్వాత ఇంతవరకు కుల జనగణన చేయలేదని అన్నారు.

జనగణన కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పిడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఓబీసీ లను క్రిమిలేయర్ పేరుతో అణచివేస్తున్నారని, క్రిమిలేయర్ పేరున ఒబిసి ల సీట్లను అగ్రవర్ణ కులాల వారికి కేటాయించడాన్ని వ్యతిరేకించాలని అన్నారు. న్యాయ విద్యలో ఒబిసి లకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్ల న్యాయమూర్తులుగా ఆధిపత్య కులాల వాళ్ళు వచ్చి ఒబిసి లకు వ్యతిరేక తీర్పులు ఇవ్వడాన్ని వ్యతిరేకించాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో, కేంద్ర శాఖల విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేయాలని అన్నారు.

ప్రభుత్వాలు కావాలనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని, సకల సామాజిక రంగాల్లో అణగారిన వర్గాలు ఎదిగాలని కల్పించిన అవకాశాలను ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే ఉద్యమంలో ఒబిసి లు ముందుండాలని పిలుపునిచ్చారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యలో ఇంకా ఉన్నత శాఖల్లో ఒబిసి లకు తగు స్థానం లేకపోవడం బాధాకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇదేనా.. నా స్వాతంత్రమా అనే ప్రజాకాంక్ష దిన పత్రిక ప్రత్యేక సంచికను కరుణానిధి ఆవిష్కరించగా బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ సాయిని నరేందర్, సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య, ఒబిసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు హనుమంతరావు, బి.సి భాగ్యలక్ష్మి, బి.సి సంక్షేమ సంఘం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు, బి.సి. చైతన్య సంఘం ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు బత్తుక5 రమణ, ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వాసు, రాష్ట్ర గౌరవ సలాహాదారు డాక్టర్ ఆలే వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు ఆకురాతి మురళి కృష్ణ, కల్లోజు వరలక్ష్మి ప్రసాద్, ఆలే వీర యాదవ్, వరాల క్రిషి, ప్రొఫెసర్ రమేష్ బాబు, డాక్టర్ ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొనగా ఒబిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు రవికుమార్ స్వాగతం పలుకగా సి.హెచ్ రమేష్ వందన సమర్పణ చేశారు.

Leave a Reply