తిరుమలలో యధాతధంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో యధాతధంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది తిరుమలకు వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది పిల్లలకు, ఉద్యోగస్తులకు సెలవులు రావడంతో జనసంద్రంగా మారిన తిరుమల రూ. 300/- దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. సర్వదర్శనంకు వైకుంఠ క్యు కాంప్లెక్స్ 1 మరియు 2 కంపార్ట్మెంట్ లలో భక్తులు నిండి ఉన్నారు. వరాహ స్వామి గెస్ట్ హౌస్ నుంచి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వరకు లైన్ లో భక్తులు నిండి ఉన్నారు. కనుక టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఈనెల 21వ తేదీ వరకు బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు, వికలాంగులు,చంటి పిల్లలు, వయోవృద్ధులు ప్రత్యేక క్యూ లైన్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సిఆర్ఓ ఆఫీస్ గదుల కేటాయింపు కోసం భక్తులు లైన్లో వేచి ఉన్నారు. కొంతమంది భక్తులకు అద్దె గదులు దొరకక నానాఅవస్తలు పడుతన్న భక్తులు, చివరకు ఫుట్ పాత్ పైన, మెట్ల పైన వేచి ఉన్నారు.

Leave a Reply