Suryaa.co.in

Andhra Pradesh

5 లేదా 6న సాగర్ గేట్లు ఎత్తే అవకాశం

సాగర్: ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం వైపు పరుగులిడుతూ వస్తోంది. తుంగ, భద్ర, కోయినా, ఆల్మట్టి, నారాయణపురా, జూరాల, శ్రీశైలం అన్నీ పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిలో 60 వేల క్యూసెక్కులు పోతిరెడ్డి పాడు, మరి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, కాలువల ద్వారా పోగా 5 నాటికి 4.75 క్యూసెక్కులు సాగర్ వచ్చి చేరతాయి. ఆ తర్వాత కూడా మరో వారం రోజుల పాటు రెండు లక్షల క్యూసెక్కులు వస్తూనే ఉంటాయి. సెప్టెంబరు చివరి నాటికి కూడా పూర్తి స్థాయిలో నిండి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

LEAVE A RESPONSE