Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య

– వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం గా ఎడ్యుకేషన్ లో సమూల మార్పులు
– నూతన విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకుని వచ్చేందుకు దేశవ్యాప్తంగా సెమినార్లు
– ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణ్

అమరావతి: దేశంలో నూతన జాతీయ విద్యావిధానం పాలసీ తీసుకురావటం వల్ల ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించగలుగుతాం. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందటం వల్ల విద్య లో కూడా సరైన పాలసీ విధానాన్ని తీసుకురావటం లో కీలక పాత్ర ఉంటుంది.సుమారు 4 సంవత్సరాల పాటు ఈ పాలసీ పై కసరత్తు చేసిన అనంతరం తీసుకురావటం జరిగింది.

మల్టీ డిసిప్లైనరీ, రీసెర్చ్ కేంద్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ పాలసీ యొక్క ఉద్దేశం.విద్యార్థుల్లో స్కిల్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈ పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుంది.వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం గా ఎడ్యుకేషన్ లో సమూల మార్పులు తీసుకురావటం మంచి పరిణామం

పేద,మధ్యతరగతి విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలో మార్పులు తీసుకురావాలి.కొన్ని రాష్ట్రాలు ఈ పాలసీ ని అనవసరంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ పాలసీ పై సరైన అవగాహన చేసుకుంటే ఇదొక మంచి పాలసీ.నూతన ఎడ్యుకేషన్ పాలసీ పై ప్రతి ఒక్కరు అర్ధం చేసుకుని కలిసి పనిచేయాలి. నూతన విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకుని వచ్చేందుకు దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించి అవగాహన కూడా కల్పిస్తున్నాం

 

LEAVE A RESPONSE