Suryaa.co.in

Political News

సాయి రెడ్డి.. ఇప్పుడు చెప్పండి… ఎవరు ఎవరి బినామీ?

– ఎవరి హయాంలో ఎవరికి లబ్ధి చేకూర్చారు?
– ఎందుకు అదనపు లబ్ధి చేకూర్చారు?
– ఈ అదనపు వెసులుబాటు కల్పించడానికి ఏ మూటలు అందుకున్నారు?
– ఆరోజు ఆ కుటుంబ ఆడిటర్ తమరే కదా?
( రాజేష్ అప్పసాని)

విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ చూసాను. కాకినాడ పోర్ట్ ఏర్పాటు జరిగిన 1997 నుండి విచారణ జరగాలి అంటున్నారు. కేవీ రావు గారు చంద్రబాబు గారి బినామీ అంటున్నారు. ఇదే విషయాన్ని ఆరోజుల్లో వైఎస్ఆర్ కూడా ప్రస్తావించి, చంద్రబాబు గారి మీద కోర్టులో కేసు వేసి మళ్ళీ ఉపసంహరించుకున్నారు..

అలాగే జగన్ గారు అరెస్టు ఆయిన తరువాత వైఎస్ విజయలక్ష్మి గారు కూడా హైకోర్టులో చంద్రబాబుగారు అవినీతి చేశారు. అక్రమ ఆస్తులు సంపాదించారు అని ఇదే కేవీ రావు గారితో లింక్ పెట్టి ఆరోపణ చేశారు. హైకోర్టు ఇవి ఆధారాలు లేని గాలి ఆరోపణలు అని నిర్ధారించుకుని కేసు కొట్టేశారు. ఆ తరువాత మళ్ళీ సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళారు అక్కడ కూడా ఇదే విధంగా కొట్టేసారు..

ఇది ఒక అంశం అయితే, వాస్తవంగా ఈ పోర్టుకి అనుమతి ఇచ్చిన చంద్రబాబు గారి ప్రభుత్వం.. పోర్టు యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, పోర్టు ఆపరేషన్ లోకి వచ్చిన 1999 నాటి నుంచి.. రాబోయే 20 సంవత్సరాలు అంటే 2019 వరకు ఈ పోర్టు యాజమాన్య హక్కులు కేవీ రావు గారి చేతిలో ఉంటాయి.

తర్వాత రెండు సార్లు ఒక్కోసారి 5 ఏళ్ల పాటు ఎక్సటెండ్ ( టైమ్ పొడగింపు ) చేసుకునే అవకాశం కల్పించారు..అంటే మొత్తంగా 30 సంవత్సరాలు మాత్రమే, పోర్టు యాజమాన్య హక్కులు వారికి ఉంటాయి. ఆ తరువాత 2029 నాటికి పూర్తి హక్కులతో పోర్టు ప్రభుత్వానికి స్వాధీనం అవుతుంది.
ఇది వీళ్ళు చంద్రబాబుగారి బినామీ అని చెప్తున్న కేవీ రావు గారి సంస్థతో చంద్రబాబుగారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఇక్కడే అసలు ట్విస్ట్ గురించి మాట్లాడుకోవాలి.

ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడుగా ఇవే ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ గారు, 2004లో తాను సి.ఎం అవ్వగానే ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం.. ఇదే కేవీ రావు గారి సంస్థకు 1999-2019 వరకు వున్న 20 ఏళ్ల వెసులుబాటును, 30 ఏళ్ల పాటు అంటే 2029 వరకు, అలాగే తర్వాత రెండు విడతలుగా ముందు వున్న 5 -5 సంవత్సరాలు స్థానంలో, 10-10 సంవత్సరాలు extend చేసుకునే అవకాశం కల్పిస్తూ ఒప్పంద కండిషన్స్ గా మార్చారు..

అంటే వీళ్ల ఆరోపణ ప్రకారం ఆయన చంద్రబాబు గారి బినామీ అయితే ఆయన ఏమో 30 ఏళ్లకు ఒప్పందం చేసుకుంటే.. బినామీ అని ఊకదంపుడు ఆరోపణలు చేసిన ఆయన ఏమో, తానే సి.ఎం అవ్వగానే తాను మాత్రం 30 ఏళ్ల స్థానంలో 50 ఏళ్లకు వేసులుబాటు కల్పించారు వైస్సార్ .

మిస్టర్ విజయ సాయి రెడ్డి ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి బినామీ ఎవ రి హయంలో ఎవరికి లబ్ధి చేకూర్చారు? ఎందుకు అదనపు లబ్ధి చేకూర్చారు? ఈ అదనపు వెసులుబాటు కల్పించడానికి ఏ మూటలు అందుకున్నారు? అన్నట్టు ఆరోజు ఆ కుటుంబ ఆడిటర్ తమరే కదా? ఈ మూటలు లెక్కల్లో సర్దుబాటు తమరే చేసి ఉండాలి!

సరే తమరు డిమాండ్ చేసినట్టు చంద్రబాబు గారి బినామీకి, ఈ 50 ఏళ్ల అనుమతి ఇచ్చిన ఆయన మీద కూడా మొట్ట మొదట విచారణ చేద్దాము. ఆయన పేరిట చెలామణి అయ్యే నీబోటి భజన బ్యాచ్ కి సమన్లు ఇవ్వాలా? లేకుంటే ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకున్న కొడుక్కి ఇవ్వాలో ఈలోగా డిసైడ్ చేసుకోండి.

LEAVE A RESPONSE