Suryaa.co.in

Andhra Pradesh

బాబుకు సాయిసాధన చిట్‌ ఫండ్స్ బాధితుల గోడు

అమరావతి : నర్సరావుపేటలో డిపాజిటర్లను కోట్లాదిరూపాయలకు ముంచేసిన సాయి సాధన చిట్‌ఫండ్ బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాత్రి ఆయన నివాసం వద్ద కలిశారు. తనకోసం వేచిఉన్న వారిని చూసిన బాబు, కారు ఆపి వారితో మాట్లాడారు. తమకు న్యాయం చేయమని అభ్యర్ధించగా, ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చాలామంది బంగారం అమ్మి డబ్బులు ఇచ్చామని, తమ అల్లుళ్ల నుంచి కూడా డిపాజిట్లు చేయించామని ఆవేదన వ్యక్తం చేశారు. దానితో బాబు స్పందించి ధైర్యం కోల్పోవద్దని, తాను అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE