Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా ద్రోహుల పరిపాలనకు చరమగీతం పలకాలి

– ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పాలకులకి కాపలా
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్

విజయవాడ : ప్రజల పై నమ్మకం లేని ప్రజాద్రోహుల పరిపాలనకు చరమ గీతం పలకాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పిలుపునిచ్చారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పాలకులకు కాపలాగా ఉన్నారని విమర్శించారు. 23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం హేయం….అమానుషం…నీచం అని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆస్పత్రిలలో భద్రత ఎక్కడ? ఉందని ప్రశ్నించారు. దశ లేని “దిశ” చట్టంతో ఏం ఉపయోగమని, హోమ్ మంత్రులు రాష్ట్రానికి దిష్టిబొమ్మలని గత మంత్రి ఇంతే, ప్రస్తుత మంత్రి అంతేనన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఉత్సవ విగ్రహంగా మారిందని వాపోయారు ఎద్దేవా చేశారు. ఈ 21 వ శతాబ్దం లో కూడా భారత దేశం లో మహిళకు ఇంత అగౌరవమా? అని విచారం వ్యక్తం చేశారు. రోజుకో అత్యాచారం, రోజుకో ఆత్మహత్య ఈ జగన్ రెడ్డి పాలనలో జరగడం సిగ్గు చేటు అని విమర్శించారు.

సీఎం కాన్వాయ్ కోసం యాత్రికుల కారు తీసుకెళ్లడం వంటి అరాచకాలు ఏంటని, రవాణా అధికారులు బలవంతంగా కార్లు లాక్కొని కాన్వాయ్ లకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు? రాష్ట్రంలో జగన్ రెడ్డి రాచరిక పాలన, సీఎం కాన్వాయ్ కి గంటల సేపు ప్రజలను ఎండలో నిలిపివేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

అప్పులతో పాలన, పేపర్ ప్రకటనలతో అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరెంట్ కోతలతో జనం విలవిలలాడుతున్నారని, పల్లెల్లో ప్రత్యక్ష నరకమేనని, పట్టణాలకు కరెంట్ కోతలు పాకాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కొనసాగాలని కోరారు.

LEAVE A RESPONSE