విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణను సిద్దం చేసుకోండి

• విపత్తు నిర్వహణ సన్నద్ధత,పరికరాలు కొనుగోలు,కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలకు 10 శాఖలకు 73 కోట్ల 74 లక్షల రూ.ల నిధులకు ప్రతిపాదనలు
• ప్రతిపాదనల పరిశీలన నిధులు మంజూరుకు నలుగురు అధికారులతో కమిటీ
• కమ్యూనిటీ భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సిఎస్ డా.సమీర్ శర్మ

అమరావతి,22 ఏప్రిల్:కమ్యునిటీ భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సిఎస్ అధ్యక్షతన విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రిపేర్డ్నెస్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కు సంబంధించి 6వ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ కార్యక్రమాల్లో భాగంగా ప్రిపేర్డ్ నెస్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కు సంబంధించి వివిధ శాఖలకు అవసరమైన నిధులు మంజూరుపై ఈసమావేశంలో చర్చించారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విపత్తుల నిర్వహణ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి 10 శాఖలకు సంబంధించి సుమారు 73 కోట్ల 74 లక్షల రూ.ల ప్రతిపాదనలు అందాయని సిఎస్ కు వివరించారు.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ కమ్యునిటీ భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్ధం కావాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలకు అవసరమైన పరికరాలు కొనుగోలుతోపాటు సన్నద్ధత,కెపాసిటీ బిల్డింగ్ వంటి చర్యలు తీసుకోవాలన్నారు.

వివిధ శాఖల వారీ వచ్చిన ప్రతిపాదనలపై సిసిఎల్ఏ మరియు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,హెచ్ఆర్డిఏ అదనపు డైరెక్టర్ జనరల్,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ లతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సిఎస్ చెప్పారు. ఈకమిటీ ఒకసారి కూర్చొని ప్రతిపాదనలను సమీక్షించి ఆయా శాఖలవారీ అవసరాల మేరకు నిధుల ఆవశ్యకతను గుర్తించి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆప్రకారం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని సిఎస్ డా.సమీర్ శర్మ చెప్పారు.

రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ ప్రక్రియలో భాగంగా వివిధ శాఖలవారీగా ముందస్తు సన్నద్ధత,కెపాసిటీ బిల్డింగ్ మరియు శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులకు స్పష్టం చేశారు.అలాగే ఎమర్జెన్సీ పరికరాలు,ఎమర్జెన్సీ సౌకర్యాల కల్పనకు,సన్నద్ధత,కెపాసిటీ బిల్డింగ్ అంశాల్లో స్థానిక మరియు కమ్యూనిటీని భాగస్వాములను చేయడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.అలాగే సన్నద్ధత,కెపాసిటీ బిల్డింగ్ విషయంలో ముందస్తు హెచ్చరికల విధానాన్ని మరింత పట్టిష్టవంతం చేయాల్సి ఉంటుందని సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.

అదే విధంగా విపత్తుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన,విద్య,పరిశోధన, సాంకేతికను జోడించే అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పారు.అన్ని సంస్థల్లోను విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంలో కెపాసిటీ పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.

అంతకు ముందు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ విపత్తుల నిర్వహణ కార్యక్రమాల్లో భాగంగా సన్నద్ధత,కెపాసిటీ బిల్డింగ్,పరికరాల కొనుగోలు తదితర అంశాలకు 10 శాఖలకు సంబంధించి సుమారు 73కోట్ల 74 లక్షల రూ.ల ప్రతిపాదనలు అందాయని చెప్పారు.
వాటిలో ఎపి స్టేట్ డిజాష్టర్ రెస్పాన్సు ఫోర్సెస్ కు రూ.19.94 కోట్లు,ఎపి స్టేట్ డిజాష్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ కు రూ.12.84 కోట్లు,పశు సంవర్ధకశాఖకు 63 లక్షల రూ.లు నిధులు అవసరం ఉందని చెప్పారు.అలాగే మత్స్యశాఖకు 4 కోట్ల 41 లక్షల రూ.లు,వ్యవసాయశాఖకు 47 లక్షల రూ.లు,అటవీశాఖకు 38 లక్షల రూ.లు,పాఠశాల విద్యాశాఖకు 5 కోట్ల 47 లక్షల రూ.లు ఎపి స్టేట్ డిజాష్టర్ మేనేజిమెంట్ అధారిటీకి 23 కోట్ల 38 లక్షల రూ.లు,మున్సిపల్ మరియు అర్బన్ డెవల్ప్మెంట్ శాఖకు 3 కోట్ల 85 లక్షలు,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 3 కోట్ల 85 లక్షల రూ.లు నిధులు అవసరం ఉందని వివరించారు.

ఈసమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,హెఆర్డి ఇనిస్టిస్ట్యూట్ అదనపు సంచాలకులు ప్రద్యుమ్న,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు తదితర అధికారులు పాల్గొనగా వీడియో లింక్ ద్వారా నీటిపారుదల,పంచాయితీరాజ్ తదితర శాఖల ఉన్నతాధికారాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.