Suryaa.co.in

Andhra Pradesh

గిరిజనుల సంక్షేమంపై సజ్జల పచ్చి అబద్దాలు ఆడుతున్నారు

-గిరిజనుడికి (కుంభా రవిబాబు) ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన జాతిమొత్తం అభివృద్ధి చెందినట్లు మాట్లాడుతున్నారు
-విద్యా, వైద్య రంగంలో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే…గర్భిణీలను నేటికి డోలీలలో ఎందుకు తరలిస్తున్నారు?
-చనిపోయిన బిడ్దల శవాలను సైకిళ్లపై తీసుకెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకున్నాయి?
– రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ ధారు నాయక్

ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగన్ రెడ్డి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సొంత డబ్బా కొట్టుకున్నారు. గిరిజన సంక్షేమంపై పచ్చి అబద్దాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు 4.5 లక్షల ఎక్కరాలకు ఇచ్చినట్లు అబద్దాలను అద్దంలో పెట్టిచూపించే ప్రయత్నం చేశాడు.

వైకాపా నాలుగేళ్ల పాలనలో 4.5 లక్షల ఎకరాలు కాదుకదా 4 వేల ఎకరాలకు కూడా గిరిజనులకు హక్కులు కల్పించలేదు. పైగా పెసా చట్టాన్ని ఉల్లంఘించి హైడ్రో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో లక్షలాది గిరజనుల భూములను బడా కంపెనీలకు ధారదత్తం చేసి గిరిజనుల పొట్టికొట్టిన ప్రభుత్వం ఇది.

ఒక గిరిజనుడికి (కుంభా రవిబాబు) ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన జాతి మొత్తం అభివృద్ధి చెందినట్లు మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ పార్లమెంటు జనరల్ స్థానం నుంచి గిరిజనుడైన చందూలాల్‌ను పార్లమెంటుకు పంపిన ఘనత చంద్రబాబుది. జనరల్ స్థానం నుంచి ఒక గిరిజనుడిని శాసనసభకు గానీ, పార్లమెంటుకు గానీ పంపే ధైర్యం వైకాపా ప్రభుత్వానికి ఉందా?

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకే టీచర్ ఉద్యోగాల ఇవ్వాలని నాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన జీ.ఓ నం.3 ని చంద్రబాబు కొనసాగించారు. ఆ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేస్తే కనీసం స్పందించని వైకాపా ప్రభుత్వానికి గిరిజన సంక్షేమంపై మాట్లాడే హక్కు ఉందా? విద్యా, వైద్య రంగంలో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే…గర్భిణీలను హాసుపత్రులకు నేటికి డోలీలలో ఎందుకు తరలిస్తున్నారు?

చనిపోయిన బిడ్దల శవాలను సైకిళ్లపై తీసుకెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకున్నాయి? రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన ఎస్టీ కమీషన్‌ను సైతం రాజకీయాలకు అడ్డగా మార్చారు. అదే చంద్రబాబు నాయుడు పున్నయ్య కమిటీని ఏర్పాటు చేసి దళిత-గిరిజనుల రక్షణ కోసం 16 జీవోలను ఏకదాటిలో విడుదల చేసారు. అది చిత్తశుద్ధి అంటే.

16 గిరిజన పథకాలను రద్దు చేసి వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని పాతరేసిన ఘనహీన ప్రభుత్వంగా జగన్ రెడ్డి ప్రభుత్వమని గిరిజనులు చెప్పుకుంటున్నారు. గిరిజన బిడ్డలకు నైపుణ్య అభివృద్ధిని రద్దు చేసి వారికి ఉపాది లేకుండా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని గిరిజనులు ఎదురు చూస్తున్నారు.

LEAVE A RESPONSE