Suryaa.co.in

Telangana

జీతం రాలేదు

భార్య : ఏవండి సరుకులు అయిపోయినాయి
లిస్ట్ రాశా తీసుకొని రాండి
భర్త : జీతం రాలేదు.
భార్య: ఎందుకు అబద్దాలు చెబుతావు?
ఈ రోజు 10 వ తారీకు జీతం రాలేదని
బుకాయిస్తున్నావు.

భర్త : నిజంగా రాలేదు.
బిడ్డమీద ఒట్టు..
గవర్నమెంటు దగ్గర డబ్బులు లేవంటా

భార్య: వెటకారంగా కోపంగా
ఇగో గీ నమస్తే
తెలంగాణ పేపర్ చూడు
kcr కాడ
డబ్బులు లేకనే
7500 కోట్లు రైతుల
ఖాతాలో free గా ఏస్తుండా ?
రోజు పని చేసే మీకు జీతం
ఎయ్యకుండా,
ఈ ఏడు బాగా వడ్లు పండిన
రైతులకు ఎట్టా ఏస్తుండు ?
నీకు జీతం వచ్చింది కాని నీవు
నన్ను కాదని చాటుగా ఇంకొక
సంసారం పెట్టినట్టుంది.(ఏడుపు)

భర్త : నిజమే నన్ను నమ్ము..
పాలవాడు : సార్ పాలబిల్లు
భర్త. : జీతం రాలేదు.
పాలవాడు : ఏందిసార్ నేనెప్పుడు
సూడలే
10 తారీకు దాంక జీతం
రాకపోవడమేంది సార్..
గిట్లైతే రేపన్నుండి
పాలు పోయను
సార్ మీ సర్కార్
నౌకరోళ్లకు పోస్తే
పస్ట్ కే వచ్చేవి.
గిట్లైతే కష్టమే
రేపు ఇస్తేనే పోస్తా…

పోన్ రింగ్ : హలో
బ్యాంకు మేనేజర్ : హలో సార్ మీ EMI
చెక్ బౌన్స్ అయ్యింది ,
రేపు బ్యాంక్ కి
వచ్చి క్లియర్ చేయ్యండి
లేదంటి మేము
లీగల్ గా ప్రోసీడ్ అవుతాము

ఉద్యోగి : సార్ జీతం రాలేదు
బ్యాంక్ ఉద్యోగి : అదేందయ్యా
10 తారీకు
జీతం రాలేదంటావు.
తమాశానా
మాకు 1 నే వచ్చింది.

ఉద్యోగి : మాటలు లేవు ,
ఏమిటి ఖర్మా
బంగారు తెలంగాణలో..

కొడుకు : డాడి చెల్లికి నాకు
ఈ నెల ఫీజు
కట్టాలి.ఫీజులేకుంటే
బడికి వద్దన్నారు
మా కరస్పాండేంట్ ఇవ్వు

ఉద్యోగి : జీతం రాలేదు..వచ్చాక
బడికి పోదువు
ఇంటికాడనే ఉండురి .

పేపర్ బాయ్ : సార్ పేపర్ బిల్లు
ఉద్యోగి: జీతం రాలేదు.
లైన్ మెన్ : సార్ కరెంటు బిల్లు ?
ఉద్యోగి : జీతం రాలేదు,వచ్చాక కడతా

లైన్ మెన్ :కట్టకుంటే మా AE
కనెక్షన్ dis connect చెయ్యమన్న్ఆడు
అని చేశాడు
కనెక్షన్ కట్ చేస్తున్నా
కరంట్ పోగానే ఇంట్లో
నుండి పాప
ఏడుపు కార్టూన్
నెట్‌వర్క్ రాట్లేదని

ఇంతలో పోన్ రింగ్
అవతలినుండి అమ్మ
బాబు రాము సంక్రాంతికి
అక్కా చెల్లెలు బావలు మేమంతా
మీవద్దకే బయలుదేరాము
2 గంటల వస్తాం వంట
చేసి పెట్టమను కోడలమ్మను..

ఉద్యోగికి దిమ్మతిరిగి పోయింది..
ఒకటే ఆలోచన ఏమి చెయ్యాలి
అప్పు పుట్టడం లేదు,
జీతం టైం కు రావడం లేదు…
అని రైలు పట్టాల ప్రక్కకు
వెళ్లి కూర్చున్నాడు.

గొర్రెల కాపరి: ఏంది సార్ తెలంగాణ
వచ్చిందిగా
మళ్లి రైల్ రోకోకు
ఎందుకొచ్చినవ్

ఉద్యోగి : అదేం లేదు ,
కొంచెం ప్రశాంతత కోసం
వచ్చిన.(లోపల చావడానికి)

గొర్రెలకాపరి : ఏమైందిసార్
ఉద్యోగి : జీతం రాలేదు,
అప్పులోల్లు
అడుగుతుండ్రు,
నా పెళ్లాం కూడా నమ్మడంలే్దు

గొర్రెలకాపరి :ఏ ఊకోసార్
10 తారీకు ఇయ్యాల
జీతం రాలేదంటే నమ్మాల్నా
ఈ బంగారు తెలంగాణల
హ హ వెటకారంగా నవ్వు

ఉద్యోగి : ఇయాల వెలుగు
పేపర్ చూడలేదా
సర్కార్ కాడ డబ్బులు లేవంటా?

గొర్రెల కాపరి: ఏహా అది
అబద్దం సార్
ఇగో
గీ నమస్తే తెలంగాణ
పేపర్ చూడు
నేను రోజు
తెచ్చుకొని గొర్లకాస్తూ
సదువుతా
సూడు గొర్లు ప్రీ,బర్లు ఫ్రీ,
చేపపిల్లలు ఫ్రీ,
దళిత బంధు 10 లక్షలు ఫ్రీ ,
రైతులకు రైతు
బంధు ఫ్రీ,పేదలు
నెలకు 6 కేజీల బియ్యం
ఫ్రీ,ముసలోళ్లకు ఫించన్ ఫ్రీ…
ఇన్ని ఫ్రీగా ఇస్తానికే డబ్బులు ఉన్నప్పుడు
మీ జీతానికి డబ్బులు లేవంటే
మేము నమ్మాల్నా ?

మీరు kcr ను
బదనాం చేస్తుండ్రు సారు ,
ఇది మంచి పద్దతి కాదు.

ఉద్యోగి : నిజమయ్యా జీతం రాలేదు
గొర్రెల కాపరి: ఏ ఊకో సార్ సర్కార్ కాడ
డబ్బులేకుంటే కాళేశ్వరం ఎట్టా
కడుతుంది నీళ్లుజూడు ఎట్టా
దుంకుతున్నాయో..(పేపర్ చూపుతూ)

ఉద్యోగి : ఏం మాట్లాడాలనో అర్దం కాక
బేలచూపులు చూస్తుండు

గొర్రెలకాపరి: నవ్వుతూ సారు మీరు అప్పుడు
తెలంగాణ ఉద్యమంలో రైలుకు అడ్డంగా పడుకొని ప్రాణాలు ఫణంగా పెట్టి
మొత్తుకుంటే గీల్లు పిచ్చోళ్ల అనుకున్నా
కాని మీ పుణ్యాన మాకు అన్ని
ఫ్రీగా వస్తున్నాయి
మీ కాళ్లకు దండం..

పని చేయని మాకే లక్షలు
లక్షలు ఫ్రీగా ఇచ్చే
KCR సారు ,
10వ తారీకుదాక
ఎందుకెయ్యడు సార్ జీతం…

సార్ జీతం ఏసినాలే గాని
నీవు ఏమైనా పేకాట,
తాగడానికి,క్రికెట్ బెట్టింగ్ ల పెట్టి లాస్ అయినవా ఎంది సారు.

లేదా..లేదా…గుణుగుతూ
ఇంకొక సంసారం పెట్టి వారికిచ్చి
జీతం రాలేదని నాటకం ఆడుతూ
మా KCR సారును బదనాం చేస్తున్నావా?

ఉద్యోగి: ఒరేయ్ నాయినా
నా అమ్మతోడురా
నా బిడ్డల తోడు జీతం
రాలేదురా నాయినా..

గొర్రెలకాపరి: గదేంది తెలంగాణొస్తే మస్తుగుంటదని
మీరే గదా బళ్లు బంజేసి
కొట్లాడి తెచ్చుకుంది..మీరే కదా!

ఉద్యోగి : కంట నీరు
గొర్రెలకాపరి : అయ్యొసారు
ఏడుస్తున్నావేంది ?
ఆగండి రైలుకింద
పడి సస్తావా ఏంది
నీకు భూమి లేదా?
రైతుబంధు పడలేదా?

ఉద్యోగి: లేదు ఉన్న భూమి
అమ్ముకొని చదివి
సర్కార్ కొలువెక్కిన
అదే నేను చేసిన
మొదటి పాపం.

తెలంగాణ వస్తే మంచిగా
బతుకుతామనుకొని
లాఠీదెబ్బలు తిని ఉద్యమం
చేయడం నేను చేసిన రెండో తప్పు..

ఇది మన తెలంగాణ
అని నా హక్కులను
అడగకుండా మనవాడు మనల్ని ఆదుకుంటాడని నమ్మడం మూలంగానే
10 తారీకైనా జీతం వేయడం లేదు..

ఇక ఈ గోస తట్టుకోలేకనే
రైలుకింద దూక పోయిన
నీవు కాపాడినవు..

గొర్రెలకాపరి : ఏ ఊకో సారు
నేను గొర్రెల కాస్తున్న
పులి వస్తది .అది పులిఅని భయపడి
నా జీవన భృతియైన గొర్రెను
దానికి బలి ఇస్తనా ?

నా దుడ్డుతో దాన్ని
తాటతీసి నన్ను
నా గొర్రెల కాపాడుకుంటా..
భయపడొద్దు సారు
పోరాటం చెయ్యాలి…
నీవు పని చేసినా జీతం రాకుంటే
రైలుకింద పడే బదులు ,
అప్పుడు తెలంగాణ ఉద్యమం
మళ్లా చెయ్యిరి అంతే గాని

పంతులువు నీవే పది మందికి చెప్పేటోనివి ..దైర్యంగా ఉండు.
అయినా మా నానమ్మ చెప్పేది
గురువుల
ఏడ్చే రాజ్యం బాగుపడదని..

సారు మీరు తేనేటీగలాగ
మకరందం ఇచ్చేటోళ్లు
మరి టేనేటీగకు పొగపడితే అది ఎదురుదాడిచేసి కరుస్తుంది..కదా

మరి మీరు కూడా న్యాయంకోసం
పోరాటం చెయ్యిరి..
జోకుడు నాయకులను పక్కకు పెట్టురి..
వాళ్లవల్లనే మీకీ ఖర్మ..

నాకు తెలుసు..
ఇక జై తెలంగాణ బంద్ చేసి
పోరు తెలంగాణ జిందాబాద్
అనండి సారు
అన్ని సర్దుకుంటాయి.

నీకు ధన్యవాదాలు తమ్ముడు
ఇక జోకే మా నాయకుల
ఇంటి ముందు
కూర్చుంటా జీతం కోసం….
ఎందుకంటే వాళ్లు చెబితేనే తెలంగాణ ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు
తిని తెలంగాణ తెచ్చినం .
ఇక జీతం కూడా సమయానికి
రప్పించాల్సిన భాద్యత వారిదే కదా..

ఇక మొదలెడతాం పోరాటం
జై పోరు తెలంగాణ…

– ఓ సగటు ఉద్యోగి ఆవేదన

LEAVE A RESPONSE