సేమ్ టు సేమ్ మోడీ…
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఆరుగురు ఉంటారని చెబుతుంటారు. మన తెలుగు సినిమాల్లో కూడా.. డబుల్-త్రిబుల్ యాక్షన్ హీరోలు పాత బ్లాక్ అండ్ వైట్ కాలంలో చూశాం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు పౌరాణిక-జానపద-సాంఘిక సినిమాల్లో అలా కనిపించిన వారే.
కానీ.. ఇప్పుడు కర్నాటక ఉడిపి శ్రీకృష్ణమఠంలోని వంటశాలలోకి అడుగుపెడితే.. అలాంటి సంభ్రమాశ్చర్యం మన సొంతమవుతుంది మరి! ఎలాగంటారా? అక్కడి వంటశాలలో తెల్ల గడ్డంతో ఉన్న వ్యక్తి.. అచ్చం మన ప్రధాని నరేంద్రమోదీలా కనిపిస్తారు కాబట్టి.
నిజం! ఆ పాకశాలలో అటు ఇటు తిరిగే వ్యక్తి .. అచ్చం మన ప్రధాని మోదీలా తెల్లటి గడ్డం, ఆయన ఛాయలతో కనిపిస్తుంటారు. ఆ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అచ్చం మోదీకి జిరాక్సులా కనిపించే ఆయనను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు! ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్ అవుతోంది.