– ఎంపీగా అరుదైన ఘనత సాధించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఎంపీల పనితీరు ఆధారంగా ఇచ్చే సంసద్ రత్న అవార్డుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. పార్లమెంట్ సభ్యునిగా కనబర్చిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ ఈ అవార్డుకు ఎంపిక కావడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
అవార్డుకు ఎంపిక కావడమే కాదు, అతి పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఎంపీగా కూడా రామ్మోహన్ నాయుుడు రికార్డు సృష్టించారు. జిల్లా ప్రజలకు, కింజరపు అభిమానులకు, టీడీపీ శ్రేణులకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు రామ్మోహన్ చెప్పారు. సంసద్ రత్న అవార్డ్స్ 2020కి గానూ మొత్తం 10 మంది ఎంపీలను ఎంపిక చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ బృందం ఆధ్వర్యంలో ఈ అవార్డులకు ఎంపిక జరిగింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు కాగా.. ఇద్దరు రాజ్యసభ సభ్యులు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సూచనతో 2010 నుంచి ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు.