Suryaa.co.in

Andhra Pradesh

రోజా ఓ కరెప్షన్‌ క్వీన్‌

-వెంటిలేటర్‌పై ఆమె రాజకీయ కేరీర్‌
-వైసీపీ నుండి గెంటేయడం ఖాయం
-చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు
– టీడీపీ మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి

రాజకీయంగా రోజాకే దిక్కులేని స్థితిలో ఉందని, అలాంటి ఆవిడ విజనరీ అయిన చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని టీడీపీ మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి అన్నారు. జగన్‌రెడ్డి ఇప్పటి వరకు ఏడు జాబితాలు ప్రకటించినా ఇంతవరకు రోజా పేరును ఖరారు చేయలేదని, ఆమె రాజకీయ కేరీర్‌ వెంటిలేటర్‌పైన ఉందని, ఆ విషయాన్ని గమనించి మసులుకుంటే ఆమెకే మంచిదని అన్నారు.

అన్ని సర్వేల్లో రోజాకు సగరి ప్రజలు సున్నా మార్కులు ఇచ్చారని, టోలు గేట్లు పెట్టి, భూమలు కాజేసి, మట్టిని దోచుకొని నగిరి ప్రజలను రోజా పీడిరచుకు తిందని, ఆమెను అక్కడి ప్రజలు కరెప్షన్‌ క్వీన్‌ అంటున్నారని అన్నారు. చంద్రబాబుపైన విమర్శలు చేసే ముందు తనపైన వచ్చిన అవినీతి ఆరోపణలు గురించి రోజా ముందుగా సమాధానం చెప్పాలని, తన పార్టీకి చెందిన కౌన్సిలరే మొహం మీద ఊసినట్లు 40 లక్షల లంచం ఇచ్చానని చెప్పిందని, ఇంతవరకు దానిపై రోజా ఎందుకు స్పందించలేదని, తన పార్టీ నేతలెవవ్వరూ రోజాకు మద్దతుగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

చంద్రబాబుపై నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్న రోజాపై సొంత పార్టీ నుండే అవినీతి ఆరోపణలు వస్తే సాక్షీ మీడియా గానీ, పేటీతఎం బ్యాచ్‌ గానీ ఎందుకు ఆమెకు మద్దతుగా నిలవలేదని గాయత్రి ప్రశ్నించారు. వైసీపీలోనూ రోజా పని అయిపోయిందని, ఆమె తన స్థానాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉందని, కొద్ది రోజుల్లో వైసీపీ నుండి ఆమెను తరిమేయడం ఖాయమని అన్నారు.

జగన్‌రెడ్డి అందర్నీ వాడుకొని అవసరం తీరాక విసిరి కొడతాడని, తన సొంత చెల్లెళ్లకే న్యాయం చేయని జగన్‌ రెడ్డి రోజాకు న్యాయం చేస్తాడనుకోవడం కలలో మాట అని, ఆ విషాయన్ని గుర్తించక రోజా పిచ్చికుక్కలా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆరోపణలు చేస్తోందని అన్నారు. జగన్‌రెడ్డి గెలుస్తాడు అని రోజా చెప్తుందని, ఏం చేశాడని జగన్‌రెడ్డి ఎన్నికల్లో గెలుస్తాడని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతి ఎకారాకు నీరివ్వాలని ఒక తపస్విలా పని చేశారని, అదే జగన్‌రెడ్డి ఎకరం కనబడితే చాలు కబ్జా చేసుకుంటూ పోయాడని చెప్పారు.

ఏం చేసినా జగన్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని, వైసీపీ టిక్కెట్‌ ఇచ్చినా కూడా చాలా మంది నేతలు జగన్‌రెడ్డి మొహన కొట్టి వెళ్లిపోతున్నారని అన్నారు. రోజా మంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రతిపక్షాన్ని తిట్టడానికే తన అధికారాన్ని ఉపయోగించుకోందని, రాజకీయ జీవితం చరమాంకంలోనైనా వాస్తవాల్ని గ్రహించి నోటికి తాళం వేసుకుంటే ఆమెకే మంచిదని సందిరెడ్డి గాయత్రి హితవు చెప్పారు.

LEAVE A RESPONSE