Suryaa.co.in

Telangana

మా బాబును మీరే ఆదుకోండి సారూ….

-తన కొడుకుకు చిన్నప్పటి నుండే షుగర్ వ్యాధి సోకిందని ఆవేదన
-బాబు పరిస్థితిని చూసి చలించి పోయిన బండి సంజయ్ కుమార్
-కార్పొరేట్ ఆసుపత్రిలో పూర్తి చికిత్స అందిస్తానని భరోసా ఇచ్చిన సంజయ్
‘‘ఆ అబ్బాయి మణితేజ. వయసు 8 ఏళ్లు. తినడానికి తిండి లేదు. కనీసం కాళ్లకు చెప్పుల్లేవు. పైగా చిన్నప్పుడు షుగర్ వ్యాధి సోకింది. తండ్రి పొన్నాల శంకర్ రోజువారీ కూలీ. సొంత ఇల్లు కూడా లేని దైన్య స్థితి. రెక్కాడితే డొక్కాడని బతుకులు. తినడానికి డబ్బుల్లేక అల్లాడుతున్న తండ్రికి ప్రతిరోజు కొడుకు ఇన్సూలిన్ ను వేయించడం శక్తికి మించిన పనైంది. సాయం కోసం టీఆర్ఎస్ నేతల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన తన కొడుకుకు ఖరీదైన వైద్యం అందించడం తనవల్ల కాదని భావించిన తండ్రి పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు. తన కొడుకు మణితేజ పరిస్థితిని వివరించి మీరే కాపాడాలంటూ.. భోరున విలపించారు. పాదయాత్రలో బిజీగా ఉంటూ వేలాది మంది బాధలను పంచుకుంటూ ముందుకు సాగుతున్న బండి సంజయ్ పొన్నాల శంకర్ చెప్పిందంతా ఓపికగా విన్నారు. అబ్బాయి పరిస్థితిని చూసి చలించిపోయారు. ‘మీరేం బాధపడకండి. మీకు


అండగా నేనున్నా. మణితేజ నువ్వేం భయపడకు. నీ వ్యాధి తగ్గిపోయేదాకా నీకు మంచి వైద్యం అందిస్తా. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తా. బాగా చదువుకో..’’అని భుజం తట్టారు. దీంతో తండ్రి పొన్నాల శంకర్ ‘సార్…మీరు మా దేవుడు’అంటూ కాళ్లపై పడబోగా…అట్లా చేయొద్దని, మణితేజను తీసుకుని రెండ్రోజుల తరువాత తన వద్దకు రావాలని, కార్పొరేట్ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేయించి వైద్యం అందిస్తానని చెప్పారు. వారు సంతోషంగా వెళుతుండగా…మణితేజ కాళ్లకు చెప్పులు లేని విషయాన్ని గమనించిన బండి సంజయ్ చెప్పులతోపాటు మంచి బట్టలు, పుస్తకాలు కొనుక్కోవాలంటూ ఆర్ధిక సాయం అందించారు. దీంతో ఆ డబ్బును తీసుకుని కళ్లకు అద్దుకుని తండ్రీకొడుకులు ఆనందంగా ఇంటికి వెళ్లిపోయారు

LEAVE A RESPONSE