చోళీ కే పీచే క్యా హై..
చున్రీ కే నీచే క్యా హై..
ఆ సంగతి ఏమో కాని
ఈ ఖల్నాయక్ కే పీచే
బహుత్ బడా కహానీ హై..
కిస్మత్ కీ క’హాని’..!
ఇండియాకే అమ్మ
మదరిండియా
ఈ సంజయ్ దత్తును
కన్న అమ్మ..
నాన్న దత్తుడు ధీరోదాత్తుడు..
ఆపై ఉదాత్తుడు..
మరి అలాంటి జంట
కడుపు పంట..
ఎలా అయ్యాడో
ఉన్మత్తుడు..
మాదకద్రవ్యాల మత్తుడు..
చపలచిత్తుడు!
అమ్మకి..నాన్నకి
చిన్నప్పటి నుంచి చింతే..
నర్గీసమ్మకు పొద్దస్తమానం
ఈ పోకిరీ కింద చాకిరీ..
ఇతగాడి గురించి బెంగతోనే
కన్ను మూసింది మదరిండియా..
అమ్మ పాత్రలో తిరుగులేని అభినయం..
అమ్మ పాత్రకు
చెయ్యలేక న్యాయం!
డ్రగ్స్ భూతం కోరల నుంచి
బయటపడితే
హమ్మయ్య
అనుకున్న అయ్య..
అంతలో ఇంట్లోనే
ఏకే 47 గన్ను..
ఈ ఏకైక సన్ను వల్లనే
దత్తు జీవితంలో ఏకమైంది
మన్నుమిన్ను…!
పట్టుకుంది టాడా
అప్పటినుంచి జీవితాలే తేడాపాడా!!
రాకీతో మొదలైన హీరోయిజం..
కొనసాగిన రౌడీయిజం…
సినిమాల్లో హిట్లు కొడుతూ
జీవితంలో..
వివాహ జీవితంలో
ప్లాపులు చూస్తూ..
బొంబాయి పేలుళ్ల కేసులో
కటకటాలు..
వీడిపోని సంకటాలు!
ఎన్ని చేసినా హీరోగా
జీరో కాలేదు..
ఆల్ టైం హిట్టు కొట్టాడు
మున్నాభాయ్..
దంచి కొట్టాడు
లగేరహో మున్నాభాయ్..
అతడి బయోపిక్
చూసేసింది వసూళ్ల పీక్..!
మొత్తంగా సంజయ్ దత్..
ఆరడుగుల నాయక్..
మత్తు కళ్ళ ‘ఖల్నాయక్’..
‘మై ఆవారా హూ’..’బేకార్’…
జీవితం పీడకల..
కెరీర్ రంగుల కల..
త్రికళత్రాలు..
టాడాతో పట్టపగలే నక్షత్రాలు..
‘నామ్ ఓ నిషాన్’..
నచ్చినట్టు బ్రతకడమే
‘మేరా హక్’..
అతడే ఖతర్నాక్..
అతగాడే విజేత..
జైలుకెళ్లినా ఖల్నాయక్…
హీరో సంజుగానే
ఖల్నాయక్ రిటర్న్స్!
బర్త్ డే దత్తుకి
మెనీ హ్యాపీ రిటర్న్స్..!!
సురేష్ కుమార్ E..
9948546286