ఆయన..
గురుబ్రహ్మ..
తత్వమే ఆయన తత్వం..
భారతీయ భిన్నత్వంలో ఏకత్వం..
భీతిల్లలేదా తెల్లదొరల సార్వభౌమత్వం..
గురువుగా ప్రేమతత్వం..
ఎదిగినా ఒదిగి ఉన్న
పరిపూర్ణ మానవత్వం!
సర్వేపల్లి..
నడిచే విద్యాలయం..
ఆయన కొలువైన
రాష్ట్రపతి భవనం
అయింది ప్రేమాలయం..
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు
అక్షరాల ఆలయం..
కీర్తి ప్రతిష్టల
విశ్వ విద్యాలయం!
*భరతభూమి* సేచ్చావాయువులు పీల్చిన
ఆ అర్ధరాత్రి
సర్వేపల్లి మాట
జాతికి చూపించె వెలుగుబాట..
ఉపరాష్ట్రపతిగా..
రాష్ట్రపతిగా ఆయన పదవి
మెచ్చింది పృథివి..!
పేదరికపు చీకట్లో
ఆ బుడతడి మోములో
వెలిగింది జ్ఞానజ్యోతి
విస్తరాకు లేక
నేలతల్లిపైనే తిన్న బువ్వ..
ఆరువందల గదుల
సువిశాల గూటిలో
వినమ్రంగా ఒదిగిన గువ్వ!
*ఎన్ని డాక్టరేట్లో..*
విశ్వవిద్యాలయాల్లో ఇచ్చిన ప్రసంగాలు ఎన్నెన్ని రెట్లో..
తన జన్మదినం టీచర్స్ డే
కావాలన్న ఆకాంక్ష…
ఉపాధ్యాయ జాతికి
సర్వేపల్లి మాటే నాటికి నేటికీ
ఏనాటికీ స్ఫూర్తిదాయక
శుభాకాంక్షలు!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286