Suryaa.co.in

Telangana

సోషల్ మీడియా కేసుకే భయపడినోడివి.. నువ్వా మాట్లాడేది?

– ఆనాడు ఇందిరాగాంధీకి పట్టిన గతే..
– ఎంపీ అర్వింద్ పై రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఫైర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై , ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడిన తీరు ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా గతంలో అర్వింద్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని.. అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బీఎల్ సంతోష్ అంత సచ్ఛీలుడు, గొప్ప వ్యక్తి అయితే కోర్టుకెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని సతీష్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం విచారణకు రాకుండా తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్నారు.

సోషల్ మీడియాలో కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన అర్వింద్.. ఆ కేసు కొట్టేయాలని ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసుకే భయపడి కోర్టుకెళ్లిన అర్వింద్ కు.. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న కవిత పై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. ఎయిర్ పోర్టుల్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలున్నాయని, బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఢిల్లీ వెళ్లొద్దంటూ అర్వింద్ బెదిరింపులకు పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

కెమెరాల ద్వారా వ్యక్తులను గుర్తించి తమ సంస్థలు విచారణ చేస్తాయని అర్వింద్ చెబుతున్నారంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చెప్పుచేతల్లో ఉన్నాయని అర్వింద్ ఒప్పుకున్నట్టేనన్నారు. అర్వింద్ చెప్పినట్టు ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని.. ఆనాడు ఇందిరాగాంధీకి పట్టిన గతే.. నేటి కేంద్ర పాలకులకు పట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.

LEAVE A RESPONSE