అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో జాతిపితకు ఘన నివాళి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం పట్ల, ఆయనపై అక్రమ అరెస్ట్, కేసుల రిమాండ్ పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.. న్యాయం చేయాల్సిన చోట జాప్యం జరగటం అన్యాయ మని, ఆంధ్ర రాష్ట్రంలో పతనమవుతున్న ప్రజాస్వామ్య పాలన విధానాలను ఖండించి సత్యమేవజయతే.. నిజం గెలవాలి అని వాషింగ్టన్ డీ.సి లోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్ముని సాక్షిగా నినదించారు. ఈ కార్యక్రమాన్ని భాను ప్రకాష్ మాగులూరి సమన్వయ పరిచారు.
ప్రపంచ సాంకేతిక విజ్ఞాన వేదికపై..
తెలుగువారి అభ్యున్నతి కోసం ఒక శ్రమ జీవి చేసిన చెదరని, చెరిగిపోని శతాబ్దపు సంతకం.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు.. అని నినదిస్తూ.. తమ బిడ్డల భవిష్యత్తుకు ఆనాడు ఆయన చేసిన నిరంతర కృషి, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, పట్టు వదలని సత్సంకల్పం ఫలితమే ఈనాడు అమెరికాలో తెలుగు జాతి శాశ్వత విజయకేతనం.. అని మరోమారు తలచుకుంటూ..
లక్షలాది గ్రామీణ రైతు బిడ్డల జీవితాలకు దశ, దిశ నందించిన స్ఫూర్తిప్రదాత..కోట్లాది మంది ప్రజలకు దశాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసిన అసామాన్య రాజకీయ నేత..తలలు మారినా, తరాలు మారినా తెలుగువారి మేధోశక్తికి ప్రపంచ స్థాయి పట్టం కట్టిన ఆదర్శవాది ..అని నాలుగు దశాబ్దాల అపురూప తెలుగు తేజం చంద్రబాబు అని.. తప్పు ఉంటే తక్షణమే ఆధారాలు చూపి, నిరూపించి వెంటనే శిక్షించండి అని.. లేని పక్షంలో ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు..కేంద్రం ఉదాసీనతను, తెరచాటు రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.
మేము సైతం.. బాబు కోసం.. అని ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు ముక్త కంఠంతో నినదించారు.. వర్జీనియా , మేరీల్యాండ్ రాష్ట్రాలనుండి.. జానకిరామ్, రమేష్ గుత్తా, నెహ్రు, భాను ఆకర్ష్ వలేటి, ఆచంట శ్రీకాంత్, రమేష్ అవిర్నేని, నరేష్, వినీల్, సాంబశివరావు, వీరనారాయణ, ప్రభు, దుర్గాప్రసాద్, బసవరావు తదితరులు పాల్గొన్నారు.