Suryaa.co.in

Family

సె.. లవ్

సెలవంటే
లవ్వు లేనిదెవరికి
స్వేదం చిగురుకు
ఉపశమనం సెలవు

సెలవు ప్రేయసికై
పరితపించని
ప్రియులెవ్వరు

అలుపు అలను
అలరించే సెలవు
శక్తికి నెలవు

అలసిన దేహానికి
స్వాంతన లేపనం
సెలవు

కరడుగట్టిన
స్వార్థం గుప్పెట్లో
చిక్కుకున్న సెలవుకు
రెక్కలు తొడిగిన
పోరాటమే నెలవు

సంతోషానికి
చిరునామా సెలవు
సంతాపానికి నేస్తంగా
సెలవే నెలవు

చెలియలికట్ట
దాటిన సెలవూ చికాకే

నేల తల్లిని ముద్దాడే
చినుకు తండ్రి సెలవు
కర్షక లోక అశ్రువే

కర్షకుని
పంటకు సెలవు
మరుభూమికి నెలవు

విద్యార్థికి
దీర్ఘకాల సెలవు
పెను శాపమే

సంక్షేమానికి వాళ్ళిచ్చే
సెలవు
సంక్షోభానికే

ఆత్మీయుల
వీడ్కోలు సెలవు
పునరాగమనానికి నెలవు

హద్దు దాటని సెలవు
ఆనందానికి లవ్
హద్దు మరచిన సెలవు
ఆవేదనకు నెలవ్

Say love to సెలవు

– గోలి మధు

LEAVE A RESPONSE