-హైకోర్టు నిర్ణయంపై సుప్రీం వ్యాఖ్యలు
-హైకోర్టు ఆర్డర్ మొత్తం స్టే చేసిన సుప్రీం
-24న మేమే తీర్పు ఇస్తామని స్పష్టీకరణ
-24 వరకూ అవినాష్‌ను అరెస్టు చేయవద్దని సీబీఐకి ఆదేశం
-హైకోర్టు ఆదేశాలు దారుణం, ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్య
మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపి, సీఎం జగన్ సోదరుడైన అవినాష్‌రెడ్డిని ఈనెల 25వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అవినాష్‌రెడ్డికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మొత్తాన్ని, సుప్రీంకోర్టు స్టే చేయడం న్యాయవాదవర్గాల్లో చర్చనీయాంశమయింది. అవినాష్‌రెడ్డిని విచారించే సమయంలో న్యాయవాది కనిపించేలా చూడాలని, రాతపూర్వక ప్రశ్నలు ఇవ్వాలంటూ సీబీఐకి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం చర్చనీయాంశమయింది.
హైకోర్టు తీర్పు చాలా దారుణమని, ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవినాష్‌రెడ్డిని ఈనెల 25 వరకూ అరెస్టు చేయవద్దంటూ, హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈనెల 24 వరకూ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ, వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో అపీల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
మీడియాలో ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ చాలామందికి సరిగా అర్థం కాలేదు అని అర్థమవుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే హైకోర్టు ఆర్డర్ మొత్తాన్ని set aside చేసేసింది. హైకోర్టు ఆర్డర్ మొత్తాన్ని స్టే చేసింది. హైకోర్టు తన ఆర్డర్లో న్యాయవాది కనిపించేటట్టు విచారించండి రాతపూర్వక ప్రశ్నలు ఇవ్వండి ఇలాంటి సవాలక్ష కండిషన్లు సిబిఐ కి పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తన ఆర్డర్లో అన్నిటిని మీద స్టే విధించింది. అలాగే 25 వరకు రిలీఫ్ మీద కూడా స్టే విధించింది. మొత్తంగా హైకోర్టుని పక్కన పెట్టినట్టు. 25వ తారీకు మీరు వినక్కర్లేదు. 24న మేమే విని దీన్ని ముగిస్తాము అని చెప్పింది.
హైకోర్టు ఇంటరిమ్ బైల్ ఇవ్వడానికి తీసుకున్న కారణాలు పెట్టిన షరతులు ని చూసిన తర్వాతే, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. అసలు ఇటువంటి ఆర్డర్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ ఆర్డర్ సరిగా లేదు అని వ్యాఖ్యానించారు. 24వ తారీఖున వినటానికి కూడా కారణం ఏంటి అంటే.. చివరి నిమిషంలో అవినాష్ రెడ్డి లాయర్ లేచి, మాకు అవతలి వారు పిటీషన్ లో ఏమి వేశారు అనేది మాకు తెలియదు. మాకు సమయం ఇస్తే మా వాదనలు వినిపిస్తాము అని అడగటంతో , 24న మీ వాదనలు వింటాము అని చెప్పింది. నా క్లైంట్ ఇప్పుడు కూడా సిబిఐ ఆఫీస్ లోనే ఉన్నాడు. సిబిఐ కి సహకరిస్తున్నాడు. నాకు పూర్తి వివరాలు తెలియవు కాబట్టి, 24 దాకా అరెస్టు చేయొద్దు అని అభ్యర్థిస్తే సుప్రీంకోర్టు దాన్ని మన్నించి 24 వరకు అతని అరెస్టు చేయొద్దు అని మెన్షన్ చేశారు. సింపుల్ గా చెప్పాలి అంటే హైకోర్టు యొక్క ఉత్తర్వును పూర్తిగా పక్కన పెట్టేసి, హైకోర్టుని ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని సుప్రీంకోర్టు తేల్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి.
సోమవారం ఓ గంట ముందుగానే సమావేశం కానున్న ప్రధాన న్యాయమూర్తి బెంచ్
సుప్రీంకోర్టు.. సోమవారం నాడు, సాధారణ సమయానికంటే ఓ గంట ముందుగానే సమావేశం కానుంది. 10:30 నుంచి కాన్స్టిట్యూషన్ బెంచ్ విచారణ ఉన్నందువల్ల… డా సునీత పిటిషన్ పై విచారణ జరిపేందుకు, ఒక గంట ముందుగానే ఛీఫ్ జస్టిస్ బెంచ్ పైకి రానున్నారని సమాచారం. ఇప్పటికే హైకోర్టు ఆర్డర్ మీద అట్రాసియస్ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు ఎంపి అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బగానే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేతో ఊరట పొందిన అవినాష్ ఆనందం, ఆవిరికావడానికి పెద్దగా సమయం తీసుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా సీబీఐ విచారణ సమయంలో, హైకోర్టు స్టే ద్వారా అవినాష్ పొందిన వెసులుబాటు మొత్తాన్ని, సుప్రీంకోర్టు స్టే చేయడం ఆయనకు దెబ్బగానే భావిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని తామే పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు నిర్ణయంతో వైసీపీ వర్గాలు ఖంగుతినక తప్పలేదు. అంటే ఇక విచారణ ప్రక్రియ మొత్తం సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్లినట్లేనని అటు న్యాయవాదులు కూడా స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తప్పుపడుతూ, ‘దారుణం’ ‘ఆమోదయోగ్యం కాద’న్న వ్యాఖ్యలు చేయడం బట్టి.. అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై, సుప్రీంకోర్టు ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమవుతోందని రాజకీయ-న్యాయవాద వర్గాలు విశ్లేషిస్తున్నాయి.