Suryaa.co.in

National

31దాకా పాఠశాలలు మూసివేత

దేశంలో మళ్ళీ కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతొంది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ లో కొత్తగా 4,031 కరోనా కేసులు వచ్చాయి. ముగ్గురు మరణించారు. పాజిటివిటీ రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేట్ స్కూళ్ల‌ను 1నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు మూసి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కాగా రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర‌మైన కార్యక్రమాలు, ఇతర వేడుకలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. కాగా మకర సంక్రాంతి స్నానాలపై నిషేధం లేదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

LEAVE A RESPONSE