Suryaa.co.in

Andhra Pradesh

రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జల

-జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా
-ప్రీ ప్లాన్ తో సింపతి కోసమే రాయి దాడి డ్రామా
-జగన్ రెడ్డితో వారి కుటుంబ సభ్యలకు ప్రాణ హాణి
-భయపడి విదేశాలకు పారిపోయిన విజయమ్మ
-మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని.. రాయి దాడి డ్రామాకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జల చేశారని.. ప్రీ ప్లాన్ తో సింపతి కోసమే ఈ డ్రామాకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ…

సింపతి కోసం రాయి దాడి డ్రామా
ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. అందుకే కొడి కత్తి డ్రామాకు సీక్వెల్ గా గులకరాయి డ్రామకు తెరలేపారు. ఈ దాడి ప్రీ ప్లాన్డ్ గా చేసిందే. అందుకే సీఎం ప్రచారం ఉన్నా కరెంట్ పోయింది. జగన్ ప్రచారం నిర్వహిస్తున్నా సాక్షి లైవ్ ఆగింది. కుట్రలో భాగంగానే ముందే ఇదంతా ప్లాన్ జరిగింది. అని జనం అనుకుంటున్నారని చింతమనేని అన్నారు.

నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది ?
రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది?.. గాయమైనా సీఎంను ఎందుకని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు? 3 గంటలకు వరకు ఎందుకు అక్కడే ఉంచారు. చిన్నదానికే హడావిడే చేసే ఈ పోలీసులు సీఎంపై రాళ్ల దాడి చేస్తుంటే ఎందుకని కళ్లప్పగించి చస్తూ ఎందుకు ఉన్నారు? దాడి చేసిన వ్యక్తిని ఎందుకని అదుపులోకి తీసుకోలేదు.? దాడి చేసిన రాయి ఏమైంది, ఎక్కడ ఉందని చింతమనేని ప్రశ్నిచారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అడ్డుకోలేని ఈ అధికారులు వెంటనే విధులనుండి తప్పుకుంటే మేలని చింతమనేని సూచించారు.

జగన్ కు కోపం వచ్చింది… వెల్లంపల్లి గుడ్డు పగిలింది
బస్సు యాత్రలో భాగంగా అభిమానులు జగన్ కు దండ వేస్తుంటే జగన్ కనతపై బైండింగ్ వైర్ గీసుకుపోయి రక్తం వచ్చి ఉంటది.. అందుకే జగన్ కు కోపం వచ్చింది. కోపంతో ఉన్న జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లిని మోచేత్తో గుద్దాడు. దాంతో వెల్లంపల్లి గుడ్డు పగిలింది అని జనం చర్చించుకుంటున్నారని చింతమనేని అన్నారు.

అప్పుడు గొడ్డలి వేటు, కోడికత్తి డ్రామా… నేడు గులకరాయితో నాటకం
అధికారం కోసం అప్పుడు గొడ్డలి వేటుతో బాయిని హతమార్చి… కొడికత్తి డ్రామాతో అమాయకులను జైలుకు పంపిన జగన్ రెడ్డి బస్సు యాత్రలో జనాలు కనిపించకపోవడంతో ప్రస్టెషన్ కు లోనై సజ్జల డైరెక్షన్ లో గులకరాయి నాటకానికి తెరలేపారని చింతమనేని మండిపడ్డారు. వైసీపీ నాయకులతో కావాలనే రాళ్లదాడి చేయించుకుని సింపతి కొట్టేసేందు కుట్ర పన్నారని పేర్కొన్నారు. అది రాయి దాడో ఏంటో జగనే చెప్పాలన్నారు. టీడీపీపై కావాలని బురదజల్లడ్డాన్ని ఖండిస్తున్నామన్నారు.

విదేశాలకు పారిపోయిన విజయమ్మ… భయటకు రావడానికి భయపడుతున్న భాస్కర్ రెడ్డి
అధికార దాహం కోసం జగన్ ఎంతకైనా తెగబడతారని.. కావాలంటే కుటుంబ సభ్యులనైనా కూని చేయిస్తాడని.. గత ఎన్నికల్లో వై.ఎస్ వివేకా హత్యే అందుకు నిదర్శణం. ఇప్పుడు మళ్లీ ఎవరి ప్రాణాలు పోతాయోనని జగన్ కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. అందుకే విజయమ్మ విదేశాలకు పారిపోయింది. భాస్కర్ రెడ్డి బయటకు రావాలంటే భయపడుతున్నాడు. ఎవరిని చంపితే అనుమానం రాదో వారి ప్రాణాలకు ముప్పు ఉంది. అటువంటి వారు జాగ్రత్తగా ఉంటే మేలు. జగన్ రెడ్డికి చంపడం వెన్నతో పెట్టిన విద్య అని చింతమనేని విమర్శించారు.

జె బ్యాచ్ కు దగ్గర పడిన రోజులు
గుండాల పాలను రోజులు దగ్గర పడ్డాయి.. త్వరలోనే వైసీపీ పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారు. దీన్ని జగన్ చెల్లెళ్లే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో సైకో పాలన పోతుంది. ఇటువంటి కొడి కత్తి డ్రామాలను ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదు. జగన్ కు తగిలింది పెద్ద గాయమే కాదు. నాపై 40 కేసులు పెట్టారు. నాకు తగిలిందే పెద్ద గాయం. నా కుటుంబానికి తగిలింది పెద్ద గాయం. జగన్ ఇంట్లో కుక్క కనకలేక అడ్డం పడినా దానికి కూడా చంద్రబాబే కారణం అంటారు.. ఇలాంటి డ్రామాల నేతలకు భాస్కర్ అవార్డులు, ఆస్కార్ అవార్డులు ఇవ్వోచ్చు. ఈ డ్రామాకు సూత్ర దారుడు సజ్జలే. ఈ జే బ్యాచ్ కు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని చింతమనేని తెలియజేశారు.

LEAVE A RESPONSE