Suryaa.co.in

Andhra Pradesh

ఫస్ట్ టైం ఓటర్ల ఓటు కూటమికే

-ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి
-టీడీపీ 5 ఏళ్లల్లో పెట్టిన ఖర్చు రూ. 1,600 కోట్లు, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ.594 కోట్లు మాత్రమే
-నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారు
-ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి?
-జగన్ చెప్పేవి అబద్దాలు చేసేవి నేరాలు
-గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు
-నేను అధికారంలో ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి అయ్యి ఉండేది?
-మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలు ఇస్తాం
– రాజాం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఉత్తరాంధ్రలో 35 సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ రెడ్డి సభలకు కూలి జనం అయితే, ప్రజాగళానికి వచ్చేది స్వచ్ఛంధ జనం. జగన్ ఒక్కో సభకు రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారు, బిర్యాని ప్యాకెట్లు, మందు బాటిళ్లు పంచిపెడుతున్నారు. ఆయన అబద్దాల్లో పీహెచ్ డీ చేశారు. ఏ ప్రాంతం బాగుపడాలంటే నీళ్లు కావాలి. అదే సమయంలో పిల్లలను చదివించి, ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకు కరెంట్, మౌలిక సదుపాయాలు ఉండాలి. ఇదే పాలకొండ రోడ్డు ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి నడుం, కాళ్లు విరిగిపోయాయి. వైసీపీ నాయకులకు సమాధనం చెప్పే దమ్ముందా?

టీడీపీ 5 ఏళ్లల్లో ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు రూ. 1,600 కోట్లు, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ.594 కోట్లు మాత్రమే
సాగు నీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టాం. పోలవరం పూర్తి చేసి నదుల సంధానంతో ఉత్తరాంధ్రకు నీరందించాలనుకున్నాం. కాని జగన్ రెడ్డి సుజల స్రవంతికి 5 ఏళ్లల్లో రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. తారక రామతీర్ధసాగర్ ప్రాజెక్టుకు టిడిపి రూ.284 కోట్లు ఖర్చు పెడితే జగన్ పెట్టిన ఖర్చు కేవలం రూ. 76 కోట్లు మాత్రమే. మహేంద్రతనయ ఆఫ్ షోర్ కి టిడిపి రూ. 553 కోట్లు ఖర్చు పెడితే జగన్ ఖర్చు పెట్టింది కేవలం రూ. 26 కోట్లు, తోటపల్లికి రూ.237 ఖర్చు పెడితే జగన్ రెడ్డి గజపతి బ్రాంచి కెనాల్ తో కలిపి పెట్టిన ఖర్చు రూ. 61 కోట్లు మాత్రమే.

వంశధార ఫేజ్ 2కి రూ.420 కోట్లు ఖర్చు పెడితే జగన్ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార – నాగావళి అనుసంధానం రూ.145 కోట్లు ఖర్చు పెడితే జగన్ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా టీడీపీ ఐదేళ్లలో ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు రూ. 1,600 కోట్లు, జగన్ రెడ్డి రూ.594 కోట్లు ఖర్చు పెట్టారు.

భోగాపురం ఎయిర్ పోర్టును పట్టించుకోని జగన్ రెడ్డి
జగన్ రెడ్డికి తప్పుడు వార్తలు రాసే అసాక్షి ఉంది. దానికి వందల కోట్లు పత్రికా ప్రకటనల పేరుతో దోచిపెట్టారు. అంతేకాకుండా సలహాదారులకు దోచిపెట్టారు. వాటికి బదులు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి ఉంటే ప్రజలకు జలవనరులు పుష్కలంగా అందేవి. రివర్స్ పాలనలో రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం బాధ్యతలను ఉత్తరాంధ్ర గడ్డ మీద పుట్టిన జీఎంఆర్ కు అప్పజెప్పాను. విమానాలు లేని హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచానికి అనుసంధానం అయ్యింది. తద్వారా పరిశ్రమలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చి రూ.కోట్లు సంపాదించడం మొదలుపెట్టారు.

అలాగే ఈ ప్రాంతంలోను 2,700 ఎకరాలు భూసేకరణ చేసి బోగాపురం ఎయిర్ పోర్టును తీసుకువచ్చాం. టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పూర్తి అయ్యి ఉండేది. తద్వారా ఈ ప్రాంతానికి పరిశ్రమలు తరలివచ్చేవి, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి. కాని తిక్కలోడు రివర్స్ చేసి టెండర్ మళ్లీ పిలిచారు. మళ్లీ శంకుస్థాపన చేశారు. ఒక సారి తాళికడితే మళ్లీ రెండో సారి తాళికడుతున్నారు. జగన్ ఒక మానసిక రోగి. స్థిమితం లేని వ్యక్తి. భోగాపురం పూర్తి కాకపోవడానికి ఈ ముఖ్యమంత్రే కారణం.

ఉత్తరాంధ్రకు టిడిపి పరిశ్రమలు తెస్తే జగన్ గంజాయి, డ్రగ్స్ తెచ్చారు
గిరిజన విశ్వవిద్యాలయానికి 550 ఎకరాలు ఇచ్చి విశాఖ దగ్గరలో ప్రారంభించాం. ఇప్పుడు జగన్ రివర్స్ తో ఎక్కడికి వెళ్లిందో తెలియదు. భావనిపాడు పోర్టుకు శంకుస్థాపన చేసి టెండర్లు పిలిస్తే జగన్ డబ్బుల కోసం కక్కుర్తి పడి వేరే వాళ్లకు టెండర్లు అప్పగించారు. టిడిపి చేపట్టిన పనులు పూర్తి అయ్యి ఉంటే ఈ ప్రాంతం హైదరాబాద్ కంటే మెరుగ్గా అభివృద్ధి చెంది ఉండేది. విశాఖలో వైసీపీ కబ్జాతో ఉత్తరాంధ్ర విలవిలలాడింది. రూ.40వేల కోట్ల ఆస్తులను లాక్కున్నారు, దారుణంగా ప్రవర్తించారు. ఉత్తరాంధ్రకు విదేశాల నుంచి పరిశ్రమలు తెస్తే జగన్ భూ సెటిల్ మెంట్లు తెచ్చారు.

విశాఖకు వాణిజ్య రాజధానిగా చేస్తే జగన్ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా చేశారు. పిల్లలు డ్రగ్స్ కు బానిసలైతే మనకు దొరకరు. 25వేల కేజీల డ్రగ్స్ ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా? నాడు టిడిపి హయాంలో ఆదానీ, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీని తెస్తే జగన్ తరలిమేశారు. టిడిపి హాయంలో మెడ్ టెక్ జోన్ ను రావడంతో దేశంలోనే మెడికల్ పరికరాలు తయారు చేసే కేంద్రంగా తయారయ్యింది. తద్వారా 10వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. దానిని కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చిన జగన్ కు కేంద్రం అడ్డుపడటంతో ఆగిపోయారు.

కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది
జే గన్ రెడ్డికి విశాఖ ప్రజల అంటే ప్రేమ లేదు, విశాఖ భూములు మాత్రమే ఉంది. బీసీలకు జగన్ ఏమైనా పని చేశారా? టిడిపి బీసీలకు ఇచ్చిన 30 పథకాలను రద్దు చేశారు. ఆడబిడ్డలకు నిత్యావసర ధరలు పెంచేశారు. ఈ ప్రాంతంలో బీసీలు లేరా? అంతేగాని విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? ఒక సామాన్య కార్యకర్త అయిన అప్పలనాయుడు ఎంపీ అభ్యర్ధిగా ఈ ప్రాంతానికి ఉన్నారు. ఒక సామన్య కార్యకర్తను అసాధారణమైన నాయకత్వం ఇచ్చే బాధ్యత నాది. ఆయనకు ఇచ్చే గౌరవం విజయనగరానికి ఇచ్చేది. కార్యకర్త ఒక నాయకుడు కావాలి. కార్యకర్తలు నాయకులుగా ఎదగాలనేది మా సిద్ధాంతం. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిల బోడిపెత్తనాలు మా విజయనగరంలో చెల్లదు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబం అండగా నిలిచింది
ఎస్సీ, ఎస్టీలకు ద్రోహం చేశారు. 5 ఏళ్లుగా అందరిపై కేసులు బనాయించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. ఎన్నికల కమీషన్ వచ్చింది కాబట్టి మీటింగ్ లు పెట్టుకోగలుగుతున్నాం. నా ఆవేదన నా బాధ పేద ప్రజల కోసం మాత్రమే. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు నాకు ఉంది. తాగటానికి నీళ్లు లేకపోయినా నిత్యావసర ధరలు పెరిగితే ప్రశ్నించినందుకు ఎక్కడికి పోతే అక్కడ దాడులు చేయించారు. జగన్ రెడ్డిపై గులకరాయి పడితే తెలుగు జాతిపై దాడి అని సజ్జల మాట్లాడుతున్నారు. అదే నా మీద అయితే రాళ్లు పడొచ్చంటా?

ఎన్టీఆర్ 8 ఏళ్లు ముఖ్యమంత్రి, నేను 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు నా భార్య భయటకు రాలేదు. అలాంటి వ్యక్తిపై అసెంబ్లీలో ఇష్టానుసారంగా తిట్టారు. ఒక ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే ఆమె రాష్ట్రం మీద బాధ్యతతో నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో ఊరూరా తిరిగారు. నన్ను వైసీపీ ఇబ్బందులకు గురి చేస్తే 203 మంది ప్రాణాలు వదిలిపెట్టారు. 80 దేశాల్లో పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు. చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో చదివిస్తానని హామీనిచ్చారు. 25 పార్లమెంట్ లో 95 అసెంబ్లీ నియోజకవర్గంలో, 9079 కి.మీ. తిరిగి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేశారు. జైల్లో ఉన్నప్పుడు వారానికి రెండు రోజుల్లో ములాఖాత్ ఇస్తే నా కుటుంబ సభ్యులు నాలో ధైర్యాన్ని నింపారు.

రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలన్నదే నా చివరి కోరిక
ఏపీ డ్రైవర్ సీబీఎన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా సమర్ధవంతంగా రాష్ట్రాన్ని నడిపించాను. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గట్టెక్కించాలన్నదే నా కోరిక, ఆశయం. అందుకే ఎన్డీఏ తో పొత్తు పెట్టుకున్నాం. ప్రజలంటే అభిమానం ఉంటే వ్యక్తి, బాధ్యతతో ప్రవర్తించే వ్యక్తి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ప్రజలను కాపాడతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. హలో ఏపీ బైబై వైసీపీ అని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకే పవన్ ను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా మడమ తిప్పని నాయకుడిగా ప్రజల కోసం పని చేస్తున్నారు.

నరేంద్ర మోదీనే మూడో సారి ప్రధానమంత్రి అవ్వబోతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళుతున్నాం. మోదీ గ్యారెంటీ కింద స్కీంలు తెచ్చారు, అదే విధంగా టీడీపీ కూడా సూపర్ సిక్స్ తీసుకువచ్చింది. ఈ రెండు కలిస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయం. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలనేది నా చివరి కోరిక. ప్రజల రుణం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రి ఏ విధంగా సేవ చేశానో అంతకంటే మెరుగైనా పాలన చేసి ప్రజల రుణం తీర్చుకుంటాను.

ప్రశాంతమైన ఉత్తరాంధ్రను కబ్జాంధ్రగా మార్చిన జగన్
సంపద సృష్టించి, ఆదాయం తెచ్చి ప్రజలకు ఖర్చు పెట్టాలి. నేడు జగన్ ఇంట్లోనే ఆదాయం సృష్టించుకన్నారు. దేశంలోనే నెంబర్ వన్ సంపన్నదారుడు జగన్. దేశంలోనే పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. నాడు మన బిడ్డలకు ఉద్యోగులు వస్తే నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నారు. నాడు పెట్టుబడులు తెస్తే నేడు బుల్డోజర్లతో కూల్చివేతలు వచ్చాయి. నాడు సంక్షేమ రాజ్యం నేడు విధ్వంస రాజ్యం. కూల్చివేతతో పాలన మొదలు పెట్టారు. నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర నేడు కబ్జాల ఉత్తరాంధ్ర. కూటమి ఇచ్చే పథకాలతో లాభపడతారా, జగన్ ఇచ్చే పథకాలతో లాభపడతారా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎవరి పాలనలో మంచి జరుగుతుందో లేదో జనం బేరీజు వేసుకోవాలి.

ఫస్ట్ టైం ఓటర్ల ఓటు కూటమికే
ఈ ముఖ్యమంత్రి వలన బాదుడే బాధుడు. కరెంట్ ధరలు, పెట్రోల్ డీజీల్, నిత్యావసర ధరలు, పన్ను ధరలు, ఆర్టీసీ ధరలు పెరిగిపోయాయి. ఏ ప్రభుత్వమైన ప్రజల ఖర్చులు తగ్గించాలి, ఆదాయం పెంచాలి. కాని ఇక్కడ ప్రజలతో పాటు ప్రభుత్వం అప్పుల పాలయ్యాయి. ఫేక్ బటన్లు నొక్కితే అవే ప్రజలకు ఉరితాళ్లగా మారతాయి. ప్రజల ఆస్తి కూడా తాకట్టు పెట్టేస్తారు. డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, సర్వీస్ కమీషన్ లేదు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తాం. అంతే కాకుండా 25వేల కానిస్టేబుల్ ఉద్యగాలు ఇస్తానని హామీనిచ్చి ఒక్క పోస్ట్ అయినా ఇచ్చాడా?

అందుకే జాబు రావాలంటే బాబు రావాలి. ఫస్ట్ టైం ఓటర్లు జాగ్రత్తా? మీ ఓటు కూటమికి వస్తే అప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్ బాగుంటుంది. అదే ఫ్యాన్ కి వేస్తే ఉరివేసుకోవాలి. ఫ్యాన్ పని అయిపోయింది. ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు. ఫ్యాన్ ను ముక్కలు ముక్కలుగా విరగొట్టి డస్ట్ బిన్ లో పారేయ్యాలి. సైకిల్ ఎక్కి జనసేన జెండా పట్టుకొని కమలం పువ్వును సైకిల్ పై పెట్టుకొని ముందుకు వెళ్లండి మీకు అండగా ఉంటాం? 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టును ఏడాదిన్నర లో పూర్తి చేస్తాం.

రూ.3వేలు నిరుద్యోగ భృతిని ఇస్తాం. ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున ఎంత మంది ఉంటే అందరికి ఇస్తాం, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది విద్యార్ధులుంటే ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున అందరికి ఇస్తాం, వంట గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచితంగా ఇస్తాం. కేంద్ర సహాకారంతో డ్వాక్రా సంఘాల అభివృద్ధి చేసి ఆడబిడ్డలను లక్షాధికారం చేసే బాధ్యత నాది.

ఎమ్మెల్యేలను ఎమ్మార్వోలుగా ట్రాన్సఫర్ చేస్తున్నారు
కేంద్రం కిసాన్ కార్యక్రమంతో ముందుకు వచ్చారు. అందుకే ఒక్కో రైతుకు రూ.6వేలు ఇస్తున్నారు. జగన్ రెడ్డి ఒక్కో రైతుకు ఇచ్చేది కేవలం రూ. 7,500 మాత్రమే. కాని ఇస్తానని చెప్పింది రూ.12,500. కాని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో రైతుకు రూ.20వేలు అందిస్తాం. ప్రతి పేదవాడికి రూ.4వేల పింఛన్ ఇస్తాం. ఏప్రిల్ నుంచి ఫింఛన్ అందిస్తాం. వెనకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం.

పేద వాళ్లను ఆదుకోవడానికి కేంద్రం గరీబీ కింద రేషన్ బియ్యం కొనసాగిస్తుంది. పేదరికం నుంచి పైకి తేవడానికి కృషి చేస్తాను. సాంకేతికతను ఉపయోగించుకొని అభివృద్ది చేస్తాం. వాలంటీర్ల జీతాలు రూ.10వేలు చేస్తాం. స్కిల్ డవలప్ మెంట్ ద్వారా ఒక్కొక్కరు లక్షలు సంపాదించే మార్గం చూపిస్తాను. వైసీపీతో ఉంటే మీరు ఊడిగం చేయాలి, వాలంటీర్లకు స్వేచ్ఛ కావాలి. నిన్నటి వరకు ఈ ప్రాంత ఎమ్మెల్యే ట్రాన్స్ ఫర్ అయ్యి వెళ్లిపోయారు. ఇక్కడ ఉంటే ఈ ఎమ్మెల్యేకి ఓటు వేయరని తెలిసి మార్చేశారు.

రాష్ట్రాన్ని నేరాలకు అడ్డాగా మారుస్తున్నారు
జగన్ కి గులకరాయి తగిలింది అని కనికట్టు మాటలు చెబుతున్నారు. నేను వచ్చి కరెంట్ తీసేశానని మాయ మాటలు చెబుతున్నారు. బాబాయ్ ని గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని నాటకాలాడి నారాసుర రక్తచరిత్ర అన్నారు. తాను చేసిన నేరాలను వేరే వాళ్లపై తోసేసే దిట్ట. బాధితులను నిందితులుగా చేసి జైళ్లో పెట్టారు. ఇలాంటి నేరస్థులను ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డగా మారుస్తారా? రాజాంని పులివెందులుగా మారుస్తారా? నాగావళిలో ఇసుక దొరుకుతుందా? ఒకప్పుడు ట్రాక్టర్ రూ.1000 నేడు రూ.5000. ఎమ్మెల్యే జోగులు, ఎమ్మెల్సీ విక్రాంత్, జడ్పీ ఛైర్మన్ చిన్నశీను లు దోచుకున్నారు. ఏ పని చేసినా 5 శాతం వీళ్లకు ఇచ్చేయాలి. పేదవాళ్లకు ఇచ్చే సెంట్ భూమిలో ఎకరాకు రూ.10 లక్షలు కొట్టేశారు.

మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలు ఇస్తాం
పాలకొండ రోడ్డు బ్రహ్మాంఢంగా తీర్చిదిద్దుతాను. రాజాంకు అవౌటర్ రింగ్ రోడ్డు తీస్తుకుస్తాం. అన్న రోడ్లు బాగు చేస్తాం. మూసిపోయిన పరిశ్రమలను తెరిపిస్తాం. టిడ్కో ఇళ్లను టిడిపి వచ్చిన వెంటనే ఇస్తాం. పేదవాళ్ల అందరికి 2 సెంట్ల భూమిని ఇప్పిస్తాం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తాం. ఇప్పుడు జగన్ ఇచ్చిన ఇళ్లను రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తాను. జగన్ ది విధ్వంసం, నాది నిర్మాణం. దొంగలైతే పట్టుకుంటా, దొరలైతే సన్మానిస్తాం. నాగావళిపై బలసరి రేవుపై వంతన పూర్తి చేయాలి. తోటపల్లి ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేస్తాను. అన్నక్యాంటీన్, విదేశీవిద్య, పీజీ స్కాలర్ షిప్స్, చంద్రన్న బీమా లాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. చెట్టుకు పోసిన నీరు ఎలా వృదా కాదే ఎన్టీఏ కి ఓటు వస్తే అలా వృధా కాదు.

LEAVE A RESPONSE