సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస నగర్, ఉప్పర్ బస్తీ, మహ్మద్ గూడ లో బిజెపి అభ్యర్థి మేకల సారంగపాణి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ నియోజక వర్గాన్ని అభివృద్ది చేయటంలో పద్మారావు గౌడ్ విఫలమయ్యారని అన్నారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి స్వలాభం కోసం పని చేస్తున్న పద్మారావు గౌడ్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ ను సమస్యల నిలయంగా మార్చిన ఘనత పద్మారావు గౌడ్ దేనని అన్నారు. బంగారు తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల బతుకులు మారలేదని తెలిపారు. బిజెపి నాయకులు మేకల కీర్తి హర్ష కిరణ్, బీజేపి సీతా ఫల్మండి డివిజన్ అధ్యక్షులు హన్మంతు ముదిరాజ్, సికింద్రాబాద్ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, ఒమూలు, శ్యామ్, నీలం శ్రీనివాస్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.