మల్కాజిగిరిలో రూ. కోటి విలువైన 450 కిలోల గంజాయి పట్టివేత

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. రెండు ద్విచక్రవాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. రెండు బైక్ లను సీజ్ చేశారు.
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా కట్టడి చేయడంపై గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేస్తామని… రైతు బంధు, బీమా వంటివి నిలిపేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో గంజాయి కట్టడికి రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. ఎక్కడికక్కడే గాంజా తరలింపును అడ్డుకుంటున్నారు

Leave a Reply