– తీవ్రమైన కేసులకు చికిత్స అందించే సౌకర్యాల నిర్మాణానికి పునాది .
– ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ: తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు సమగ్ర సంరక్షణ అందించడానికి రాయచోటిలో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఏర్పాటు కు 30 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ల ఏర్పాటు విధానం ద్వారా తీవ్రమైన కేసులకు చికిత్స అందించే సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను సచివాలయంలో కలిసి రాష్ట్ర రవాణా,యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు.
క్రిటికల్ & ట్రామా కేర్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా రోగులకు ప్రత్యేక సంరక్షణ, పర్యవేక్షణ అవసరం కాబట్టి, ప్రస్తుత ICU సామర్థ్యం సరిపోదని.. అందువల్ల మెరుగైన పేషెంట్ కేర్ కోసం రాయచోటిలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటుకు 30 కోట్ల మంజూరు చేయాలనీ రవాణా శాఖ మంత్రి కోరగా ఆరోగ్య శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి ₹30 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.