-వ్యవసాయ, ఉద్యానవన శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్
అమరావతి: ఈ ఏడాది రాష్ట్రం నుంచి లక్ష టన్నుల అరటి ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వ్యవసాయ, ఉద్యానవన శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా నుంచి ముంబయి పోర్టుకు వెళ్లే అరటి కంటెయినర్ల రైలును సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. లక్ష మెట్రిక్ టన్నుల అరటి ఎగుమతులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, APMIP డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ ఏడి హర్ నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.