ఏపీలో భారీ వర్షాలు..18 రైళ్లు రద్దు,10 రైళ్లు దారి మళ్లింపు

-18 రైళ్లు రద్దు, 10 రైళ్లు దారి మళ్లింపు
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీవర్షాలు, వరదల కారణంగా  పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లిచినట్టు  దక్షిణ మధ్య రైల్వే  తెలిపింది. నెల్లూరు- పడుగపాడు మార్గంలో  18 రైళ్లు రద్దు చేయగా, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. 10 రైళ్లు దారి మళ్లించారు. ఒక రైలు వేళల్లో  మార్పు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దు చేసిన రైళ్ల వివరాలు..
20895 రామేశ్వరం- భువనేశ్వర్‌
22859 పూరి- చెన్నె సెంట్రల్‌
17489 పూరి- తిరుపతి
12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌
12967 చెన్నై సెంట్రల్‌- జైపూర్‌
06426 నాగర్‌సోల్‌- తిరువనంతపురం
06427 తిరువనంతపురం- నాగర్‌సోల్‌
06425 కొల్లాం- తిరువనంతపురం
06435 తిరువనంతపురం- నాగర్‌సోల్‌
12863 హౌరా- యశ్వంతపూర్‌
12269 చెన్నై సెంట్రల్‌- హజరత్‌ నిజముద్దీన్‌
12842 చెన్నై సెంట్రల్‌- హౌరా
12656 చెన్నై సెంట్రల్‌- అహ్మదాబాద్‌
12712 చెన్నై సెంట్రల్‌- విజయవాడ
12510 గువహటి- బెంగళూరు కంటోన్మెంట్‌
15930 న్యూ తినుసుకియా – తాంబరం
20890 తిరుపతి- హౌరా రైలు రద్దు