నిత్యం ఎక్కడో ఓ చోట ప్రీతి లాంటి చెల్లమ్మ లు ఎందరో ఇలా బలి అవుతూనే ఉండాలా?
ఛీ ఛీ… సిగ్గు సిగ్గు
ఆడది అబల కాదు ఆదిపరాశక్తి
అహంకారాన్ని అంతం చేసే ఆంకుశం
సృష్టి ధర్మాన్ని సవ్యంగా నడిపే ప్రకృతి ఆమె
అన్యాయం ఆమెకే జరిగితే న్యాయం ఎవరు చేయాలి ?
జాతి అంటూ ఒకరు
కులం అంటూ మరొకరు
జరిగిన అమానుషాన్ని పలచన చేస్తూంటే,
సాటి స్త్రీ శక్తి ఏం చేయాలి?
పశుత్వాన్ని నింపుకున్న మానవ మృగాలను వేటాడే కనక దుర్గలుగా మారేది ఎన్నడో?
ఊరవతల రోదిస్తున్న అమాయకపు ఆడపిల్లల ఆత్మ ఘోషను విని ఉండబట్టలేక నాలుగు అక్షరాలలో నా ఆవేశాన్ని/ ఆవేదనను కక్కేసి ఏమి ఎరగనట్టు హాయిగా నిద్రపోతున్న … నాలాంటి వారందరో ఈ సమాజానా వారందరికీ…
ఆడబిడ్డకు అ(క్షర)శ్రునివాళి అర్పిస్తూ…..