తిరుమల క్షేత్రాన్ని, తిరుపపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వాలే

– జగన్ తనదోపిడీకోసం పవిత్ర తిరుమలను వ్యాపార, మత్తుపదార్ధాల కేంద్రంగా మార్చాడు
– తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్

“తిరుపతిలో జరిగిన యువగళం పాదయాత్రచూసి, వైసీపీప్రభుత్వానికి మైండ్ బ్లాంక్ అయ్యిం ది. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఇద్దరూ తి రుపతి నియోజకవర్గ అభివృద్ధికి విశేషకృషి చేశారు. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్స్ ఆసుపత్రి, రేణిగుంట విమానాశ్రయ అభివృద్ధి, తిరుపతికి వచ్చిన తెలుగుగంగ ప్రాజెక్ట్, అండర్ డ్రైనేజ్ పనులు …ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీప్రభుత్వాల హాయాంలోనే తిరుపతి, తిరుమల బ్రహ్మండంగా అభివృద్ధి చెందాయి.

గతప్రభుత్వంలో తిరు పతిలో చంద్రబాబునాయుడు ఆరంభించిన అనేక అభివృద్ధిపనులు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. టీటీడీ ఛైర్మన్ పదవిని టీడీపీప్రభుత్వం బీసీలకు ఇస్తే, జగన్ దాన్ని తనవర్గానికి కట్టబెట్టుకున్నాడు. తనదోపిడీకోసం పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వ్యాపారకేంద్రంగా మార్చాడు. తిరుపతిలో మద్యం, గంజాయి విక్రయాలకు అనుమ తిచ్చాడు. తిరుమల కొండపైన ఉన్న వసతిసముదాయాల్లోని గదులఅద్దెలుపెంచాడు.. ప్రసా దంధరలు.. దుకాణాల అద్దెలు పెంచాడు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుపతిలో రూపాయి పని జరిగిందిలేదు..ఎక్కడా చిన్నఅభివృద్ధి కార్యక్రమం జరిగిందిలేదు. తిరుపతి చుట్టుపక్క ల ఉన్న విలువైనభూముల్ని కొట్టేయడానికి జగన్ అతని అనుచరులు సీలింగ్ విధానాన్ని తీసుకొచ్చారు..దాన్ని తక్షణమే ఎత్తేయాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.
చంద్ర బాబు శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో వందలాదిపరిశ్రమలు తీసుకొస్తే, జగన్ వాటిని కమీషన్ల కక్కుర్తితో తరిమేస్తున్నాడు. తిరుమల, తిరుపతి అభివృద్ధిలో టీడీపీప్రభు త్వాల పాత్రేమిటో, జగన్ ప్రభుత్వ భాగస్వామ్యమేమిటో బహిరంగం చర్చించడానికి తాము సిద్ధం, వైసీపీనేతలు సిద్ధమా?”

Leave a Reply